header

Libia….లిబియా...

Libia….లిబియా...

ఉత్తర ఆఫ్రికాలో మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఉన్న సోషలిస్ట్ రాజ్యం లిబియా. ఒకప్పుడు ఇటలీ వలస రాజ్యంగా ఉండి 1949 సం.లో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశ రాజధాని నగరం ఆల్జూపూర్. వీరి అధికార భాష అరబ్పీ.ఈ దేశ కరెన్సీ లిబియన్ దీనార్లు. ప్రజలు లిబియన్ అరబ్బీ, బెల్ బెర్ జాతులకు చెందిన వారు. ఈ దేశం ముస్లిం దేశం. ఈ దేశస్తులు సున్నీ ఇస్లాం మతాన్ని పాటిస్తారు. ఈ దేశ వైశాల్యం 17,75,000 చ. కి.మీ.
ఈ దేశంలో వాయువ్యాన ఉన్న కోస్తా మైదానం, ఈశాన్యంలో ఉన్న మిట్ట ప్రాంతాలు సారవంతమైన నేలలు. లిబియా దక్షిణ భాగమంతా సహారా ఏడారి. అక్కడక్కడా ఉన్న ఒయాసిస్సుల ప్రాంతాలలో నేల సారవంతమైనది. ఆగ్నేయంలో ఉన్న ఆల్ కుఫ్రా వద్ద ఉన్న సరస్సు అవసరమైన పంటనీటిని అందిస్తుంది. సముద్ర మట్టానికి 2286 మీ. ఎత్తున్న బెట్టే పర్వత శిఖరాగ్రం లిబియాలో మిక్కిలి ఎతైనది.
గోధుమ, ఆలివ్, పుచ్చకాయలు, బంగాళా దుంపలు, బార్లీ, ఉల్లి, ఖర్జూరం, టమాటోలు, నారింజ, ద్రాక్ష ప్రధానమైన పంటలు.
ఒంటెలు, గాడిదలు ఈ దేశంలో ఎక్కువగా ఉన్నాయి. గొర్రెలు, మేకలను పెంచుతారు.
జిప్సం, ఉప్పు ఖనిజాలు లభిస్తాయి. పెట్రోల్ నిక్షేపాలు ఉన్నాయి. పెట్రో ఎగుమతికి ప్రసిద్ధిగాంచినది. పెట్రోల్ ఎగుమతులు ఈ దేశానికి ప్రధాన ఆర్ధిక వనరు. జవుళీ, మత్స్య పరిశ్రమలు ముఖ్యమైనవి. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ గా నమోదైన పట్టణం ఆల్ ఆజియిహా లిబియాలోనే ఉన్నది.