మడగాస్కర్ పెద్ద ద్వీపదేశం. ప్రపంచంలోనే నాలుగవదైన పెద్ద ద్వీపదేశం. మొదటి మూడు గ్రీన్ ల్యాండ్, న్యూ గినియా, బోర్నియో. 1960 సంవత్సరంలో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అంతకు ముందు ఫ్రెంచ్ వారి వలస రాజ్యం. ఆఫ్రికా తూర్పు తీరానికి 500 కి.మీ. దూరంలో ఉంది. ఈ దేశ విస్తీర్ణం 5,87,041 చ.కి.మీ. ఈ దేశ రాజధాని అంతనా నరీవ్. వీరి అధికార భాష మలగాసీ. తరువాత ఫ్రెంచ్ కూడా మాట్లాడుతారు. వీరి కరెన్సీ Malagasy ariary … ప్రజలు క్రైస్తవ, ముస్లిం మతాలను అనుసరిస్తారు. స్థానిక సంప్రదాయ మతస్తులు కూడా ఉన్నారు.
ఈ దేశంలో కనపడే జంతువులు, పక్షులు ఈ దేశానికే ప్రత్యేకం. ఈ దేశం ఆర్ధికంగా బీద దేశం. విద్యాపరంగా కూడా వెనుకబడి ఉన్నది
బెమరీవూ నది, బెట్సుబోకా నది, మాంగో నదులు ప్రదాన జలవనరులు. ఇవి కాక సరస్సులు, తటాకాలు కూడా ఉన్నాయి. వరి వీరి ముఖ్య ఆహార పంట. కర్రపెండలం, మొక్కజొన్న, చెరకు, బంగాళా దుంపలను ఎక్కువగా పండిస్తారు. కాఫీ ముఖ్యమైన ఎగుమతి పంట మడగాస్కర్ వెనిల్లాకు ప్రపంచ ప్రసిద్ది గాంచినది. పొగాకు, లవంగాలు వాణిజ్య పంటలు.
మైకా, నికెల్, రాగి క్రోమైట్ ఈ దేశంలో లభించే ఖనిజ నిక్షేపాలు.