header

Malawi…మలావీ…

<
Malawi…మలావీ…

ఆఫ్రికాలోని దక్షిణ భాగంలో న్యాసా సరస్సుకు ఆనుకుని ఉన్న స్వతంత్ర్యదేశం మలావీ. 1964 సంవత్సరంలో బ్రిటీష్ వారినుండి స్వాంతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశ విస్తీర్ణం 1,14,484 చ.కి.మీ.. రాజధాని నగరం లిలోన్వే. వీరి అధికార భాష ఇంగ్లీష్. ఇంకా మారానీ, టోంగా, చెనా, తుంబుగా భాషలు కూడా మాట్లాడుతారు. వీరి కరెన్సీ Kwacha మలావి క్రైస్తవ మతానికి చెందిన దేశం. ముస్లిం మతస్తులు కూడా ఉన్నారు. మొక్కజొన్న వీరి ప్రధాన ఆహారం.
న్యాసా సరస్సు, షీర్వా సరస్సు, బూవా నది, షీరే నది ప్రధాన జలవనరులు. కానీ పంటలకు అనుకూలమైన నేలలు లేక పోవటంలో వ్యవసాయపరంగా మలావీ అభివృద్ధి చెందలేదు.
చెరకు, కాఫీ, ప్రత్తి, వేరుశెనగ, తేయాకు, పొగాకు పంటలను పండిస్తారు. టీ, పంచదార, ప్రత్తి. పొగాకు ఎగుమతులమీద దేశ ఆర్ధిక వ్యవస్థ ఆధారపడి ఉన్నది. మలావీ సరస్సు మత్స్యపరిశ్రమకు అనుకూలమైనది. ఈ దేశానికి ఖనిజ సంపదలు లేవు. పరిశ్రమలు కూడా తక్కువే. ఆర్ధికంగా వెనుకబడి దేశం మలావీ. కానీ పర్వత పానువులలో ఉన్న సుందరమైన వృక్ష సంపద, సరస్సులు, ప్రకృతి దృశ్యాలు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.