మారిషస్... ఆఫ్రికా ఖండతీర ప్రాంతంలో హిందూ మహాసముద్రంలో ఉండే ఓ ద్వీప దేశం.
ఈ దేశ రాజధాని పోర్ట్ లూయిస్. వీరి అధికార భాష ఏమీ లేదు ఈ దేశంలో మారిషస్ క్రియోల్, ఫ్రెంచ్, భోజ్‌పురీ, ఆంగ్లం, హిందీలతో పాటు మన తెలుగు కూడా మాట్లాడతారు.
మారిషస్ రాజధాని: పోర్ట్ లూయిస్ అతి తక్కువ జనాభా సుమారు13,50,000.(2018)
విస్తీర్ణం: 2,040 చదరపు కిలోమీటర్లు వీరి భాషలు: ఆంగ్లం, ఫ్రెంచ్
మారిషస్ కరెన్సీ: మారిషియన్ రుపీ
లక్షల ఏళ్ల క్రితం భూగర్భంలోని అగ్నిపర్వతాల విస్ఫోటనాల వల్ల ఈ ద్వీపం ఏర్పడింది. మొదటిసారిగా ఇక్కడ అడుగుపెట్టింది పోర్చుగీసు వారు.
ఇక్కడ భారత్, ఆఫ్రికా,చైనా దేశాల సంతతివారు ఎక్కువగా ఉంటారు. .
ఇప్పుడు అంతరించి పోయిన డోడో అనే పక్షులు ప్రపంచం మొత్తంలో ఇక్కడ మాత్రమే ఉండేవి. .
ఈ దేశం1968లో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందింది. .
మారిషస్ పర్యాటక దేశం కూడా. ఈ ద్వీప దేశాన్ని చూడ్డానికి దేశదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ప్రముఖ రచయిత మార్క్ ట్వైన్ ఈ దేశం గురించి‘ముందు మారిషస్ ఏర్పడింది ఆ తర్వాతే స్వర్గం తయారైంది అని అన్నారు. .
ఇక్కడ ముఖ్యమైన పర్యటక ప్రాంతం ఛామరెల్‌లోని ‘ఏడు రంగుల నేల’. తక్కువ ప్రదేశంలోని ఇక్కడి ఇసుక వేరువేరు రంగుల్లో భలేగా కనిపిస్తుంది. ఇది అగ్నిపర్వతాల ప్రభావంతోనే ఏర్పడింది.
ఈ ఐలాండ్‌లో క్రూరమృగాలు ఉండవు. ఇక్కడ కనిపించే పాములు కూడా విషపూరితమైనవి కావు.
ఈ ద్వీపం చుట్టూ ఉండే కోరల్ రీఫ్స్ ఉష్ణోగ్రతల నుంచి, షార్కు, జెల్లీఫిష్ వంటి జలచరాల నుంచి సందర్శకుల్ని కాపాడుతుంటాయి.
దేశం మొత్తం జనాభాలో రాజధాని పోర్ట్ లూయిస్‌లోనే 40 శాతం మంది నివసిస్తారు.
మారిషస్ అనే పేరు ఒకప్పటి రాజకుమారుడు మారిస్ డె నాసో పేరు మీదుగా వచ్చింది.
ఇక్కడి మొత్తం వ్యవసాయ భూమిలో 90 శాతం చెరకునే పండిస్తారు.
రెండు చేతులతో బహుమతి తీసుకోవడం గౌరవంగా భావిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. కుడి చేతితో మాత్రమే బహుమతి తీసుకోవాలి.