ఒకప్పుడు ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న ఈ రాజ్యం 1970 సం.లో స్వాతంత్రం సంపాదించుకుంది. దేశం విశాలమైనది కానీ సహజ సంపదలు ఎక్కువగా లేని దేశం. జనసాంద్రత కూడా తక్కువే. అల్జీరియా, లిబియా, చాద్, నైజీరియా, బెనిన్ దేశాలు సరిహద్దులుగా కల దేశం. ఈ దేశంలో ప్రవహించే చేజర్ నది పేరు వలన ఈ దేశానికి నైజర్ అనే పేరు వచ్చింది.
ఈ దేశం ముస్లిం దేశం. 85 శాతం ప్రజలు సున్నీ ఇస్లాంను అనుసరిస్తారు. ఈ దేశ విస్తీర్ణం 11,86,408 చ.కి.మీ. రాజధాని నగరం నియామే. వీరి అధికార భాష ఫ్రెంచ్. వీరి కరెన్సీWest African CFA franc.
ఈ దేశానికి ఉత్తరాన సహారా ఎడారి ఉంది. నైరుతీ దిశలో ప్రవహించే నైజర్ నది ఒక్కటే ప్రధాన జలవనరు.
తుమ్మ చెట్లు, ఈత చెట్లు, తాటిచెట్లను పెంచుతారు. ప్రత్తి, వేరుసెనగ ప్రధానమైన పంటలు. ఇవి కాక వరి, జొన్న, అపరాలు, కందమూలాలు, గోధుమ, పొగాకు, మొక్కజొన్న ఇతర పంటలు. పశువుల పెంపకం ప్రజలకు ప్రధాన జీవనాధారం. తగరం, యురేనియం, నెట్రాన్, రాతి ఉప్పు ప్రధాన ఖనిజ సంపదలు.