ఆఫ్రికా మద్యలో భూమద్య రేఖ మీద ఉన్న స్వతంత్ర దేశం రువాండా. ఈ దేశ రాజధాని కిగాలీ. వీరి అధికార భాష ఫ్రెంచ్, కిన్యార్వాండ్ . వీరి కరెన్సీ రువాండ్ ఫ్రాంక్. రువాండ్ రోమన్ కేధలిక్ కు చెందిన క్రిస్టియన్ దేశం.
వబగసేరా సరస్స, కీవూ సరస్సు, తేమా సరస్సు, కాగేరా నది, అకన్యారూ నది, రూజీజీ నది, వ్యబరోన్గో నదులు ముఖ్య జలాధారాలు. నీటి వనరులున్నప్పటికీ ప్రజలు తమకు అవసరమైనంత వరకే ఆహారపు పంటలు పండిస్తారు. జొన్న, మొక్కమొన్న, కర్రపెండలం, కందమూలాలు, బంగాళాదుంపలు కొద్దిగా పండిస్తారు. కాఫీ విరివిగా పండించి ఎగుమతి చేస్తారు
వీరు పండించే రోబుస్టా రకం ఇన్ స్టంట్ కాపీ తయారు చేయటానికి పనికి వస్తుంది. తేయాకు, పొగాకు ఇతర వాణిజ్య పంటలు.
జిరేనియా, పైరద్రామ్ ఓషదులకూడా పండించి ఎగుమతులు చేస్తున్నారు. పశువుల పెంపకం మీద జనం ఆధారపడతారు. తగరపు రాయి, టంగ్ స్టన్, టాంటలైట్, బెరిల్ ఖనిజ నిక్షేపాలు లభిస్తాయి. తోళ్లు ఎగుమతి చేస్తారు. రువాండా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దేశం.