పశ్చిమ ఆఫ్రికాలో అట్లాంటిక్ ను ఆనుకుని ఉన్న స్వతంత్ర దేశం సెనెగల్. ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉండి మాలీ సమాఖ్యలో భాగమై తరువాత 1960 సం.లో స్వతంత్ర రాజ్యం అయినది. ఈ దేశ విస్తీర్ణం 1,96,722 చ..కి.మీ.. ఈ దేశ రాజధాని డాకర్. వీరి అధికార భాష ఫ్రెంచ్. వీరి కరెన్సీ CFA franc ప్రజలు నీగ్రో జాతులకు చెందినవారు. సెనెగల్ ముస్లిం దేశం. ఎక్కువ మంది సున్ని ముస్లింలు. తరువాత కొద్ది సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు. సెనెగల్ దేశాన్ని గేట్ వే ఆఫ్ ఆఫ్రికా అంటారు.
సీవే నది, సాలూమ్ నది, గాంజీనది, కసామాన్సే నది ప్రధాన జలవనరులు. వేరుసెనగ ప్రధాన వ్యవసాయోత్పత్తి. 72 శాతం వేరుశెనగను ఎగుమతి చేస్తారు. వరి, జొన్న, మొక్కజొన్న, చిక్కుడు, కర్రపెండలం, బంగాళాదుంప, చిరుగడం, చెరకు, ప్రత్తి పంటలను పండిస్తారు. గొర్రెలు, మేకలను పెంచుతారు. .
జిర్కోనియం, కాల్షియం, ఫాస్పేట్ ఈ దేశ ఖనిజ సంపదలు. టూనా చేపలు దొరకుతాయి. .
సిమెంట్, జవుళీ, వీరు, సారాయి, వేరుసెనగ ఉత్పుత్తులు ప్రధాన పరిశ్రమలు.