header

Somalia….. సోమాలియా

Somalia….. సోమాలియా

ఆఫ్రికా ఖండంలో వెనుకబడిన చిన్నదేశం సోమాలియా. పడమరన ఇధోపియా, వాయువ్యంలో డిజిబౌట్, నైరుతిలో కెన్యా, మిగిలిన వైపుల హిందూ మహాసముద్రం ఈ దేశానికి సరిహద్దులు . 1960 సంవత్సరంలో బ్రిటన్, ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్వం పొందింది.
సోమాలియా రాజధాని మొగాదిషు. ఈ దేశ కరెన్సీ సోమాలి షిల్లింగ్. సోమాలి, అరబిక్ భాషలు మాట్లాడతారు. ఈ దేశం ప్రపంచంలొనే అతి బీద దేశం
వ్యవసాయం ఇక్కడి ప్రజలకు ముఖ్య జీవనాధారం. మొక్కజొన్న, అరటి పండిస్తారు. ఇక్కడ ప్రధాన నదులు షిబెల్లే మరియు జుబే. కానీ ఈ దేశంలో బీదరికం ఎక్కువ కావటంతో ఆకలి చావులు కూడా ఎక్కువే. అక్షరాస్యత కూడా తక్కువే. దీనితో ఈ దేశంలోని చాలా మంది పౌరులు సముద్రపు దొంగలుగా మారారు. ఈ మార్గంలో ప్రయాణించే ఓడలను దోచుకుంటూ లేక ఓడలను స్వాధీనం చేసుకుని జీవనం సాగిస్తుంటారు. మనం తరచుగా పత్రికలలో ఈ వార్తలను చూస్తుంటాము
వీరి డబ్బు విలువ కూడా చాలా తక్కువ. మన రూపాయకి 11 సోమాలి షిల్లింగ్ లు వస్తాయి. రవాణా, పాలు, మాంసానికి ఎక్కువగా ఒంటెలపైనే ఆధారపడతారు.
ఇక్కడ అతి ఎత్తైన పర్వత ప్రాంతం షింభిరిస్, ఇది సముద్ర మట్టానికి 2,416 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఉండే లమాదయా జలపాతం అచ్చం పిల్లలు జారే జారుడు బల్లలాగే ఉంటుంది.
సోమాలియాలో సముద్రతీరం ఎక్కువ. బీచ్ లు కూడా ఎక్కువే. కానీ విదేశీ పర్యాటకులు ఇక్కడకు రావటానికి భయపడతారు. ఎందుకంటే బీదరికం కారణంగా దోపిడీలు, నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి.