header

Tunisia….టూనీజియా

Tunisia….టూనీజియా

టూనీజియా... ఉత్తర ఆఫ్రికా లోని ఒక చిన్న దేశం. అల్గేరియా, లిబియా దేశాలు, మధ్యధరా సముద్రం దీనికి సరిహద్దులు. ఫ్రాన్స్ నుంచి మార్చి 20, 1956లో ఈ దేశం స్వాతంత్య్రం పొందింది.
టూనీజియా రాజధాని టూనీస్ దేశ విస్తీర్ణం 1,63,610 చ. కిలోమీటర్లు. వీరి అధికార భాష అరబిక్. ప్రజలు ఫ్రెంచ్ భాష కూడా మాట్లాడుతారు. కరెన్సీ టూనీజియన్ దినార్. ఒక టూనీజియన్ దినార్ మన కరెన్సీలో దాదాపు 27 రూపాయలకు(2018) సమానం.ఈ దేశం ముస్లిం మతానికి చెందినది. ఈ దేశంలో ముస్లిం జనాభా ఎక్కువ.
ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి సహారా ఈ దేశంలోనూ కొంత భాగం విస్తరించి ఉంటుంది. పెట్రోలియం, గనులు, పర్యాటకం, వస్త్ర, పాదరక్షల పరిశ్రమలు అధికం. వేడి, పొడి వాతావరణం ఉంటుందిక్కడ.
ఇక్కడ మత్మాతా అనే ప్రాంతంలో ప్రజలు ఇప్పటికీ భూగర్భ ఇళ్లలో నివసిస్తున్నారు. వేడి, బలమైన ఎడారి గాలుల్నించి తప్పించుకోవడం కోసమే గుహల్లాంటి ఈ భూగర్భ ఇళ్లని నిర్మించుకున్నారట. ఈ ఇళ్లు 23 అడుగుల లోతు, 33 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ప్రపంచం మొత్తంలో గుహల్లో నివసించే ట్రాగ్లోడైట్స్ జాతి ప్రజలు అత్యధికంగా ఉండేది ఇక్కడే.
ఈ దేశం పర్యాటక దేశం కూడా. అందమైన సముద్ర తీరాలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. ఇక్కడి అడవుల్లో జంతువులు ఎక్కువ. పులులు, సింహాలు, చిరుతపులులు, హైనాలు, జింకలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. స్టార్ వార్స్ వంటి ప్రముఖ హాలీవుడ్ సినిమాల షూటింగ్లకు పెట్టింది పేరిది సిది బో సైద్ అనే పట్ణణం మంచి సందర్శక ప్రాంతం. ఇక్కడ కట్టడాలన్నీ నీలం, తెలుపు రంగులతో ఉంటాయి. ఈ దేశంలో ఓ మంచి ఆకర్షణ ‘రోజ్ ఆఫ్ ది సహారా డిజర్ట్’ అనే పువ్వు. ఉప్పు, ఇసుకతో ఎడారిలో తయారవుతుంది. అక్వేరియాల్లో అలంకరణ కోసం ఉపయోగిస్తారు దీన్ని.
ఇక్కడి జాతీయ వంటకం ‘కాస్కాస్’. దీన్ని మాంసం, కూరగాయలతో చేస్తారు. టమాటా, షుగర్ బీట్, బాదం, ఆలివ్లు, ఖర్జూర పండ్లు ఎక్కువగా పండుతాయి