ఉగాండా అనే పేరు బుగాండా రాజ్యం పేరు మీదుగా వచ్చింది. 1962లో బ్రిటిష్ పరిపాలన నుంచి స్వాతంత్య్రం పొందింది. ఉగాండా... తూర్పు ఆఫ్రికాలోని ఓ దేశం. ఉత్తరాన దక్షిణ సూడాన్, తూర్పున కెన్యా, దక్షిణాన టాంజానియా, పశ్చిమాన కాంగో దేశాలు దీనికి సరిహద్దులు. ఉగాండాను ‘ఆఫ్రికా ముత్యం’ అనే ముద్దు పేరుతో పిలుస్తారు. చుట్టూ భూభాగాలతో ఉన్న దేశాల్లో ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం.
ప్రజలు నీగ్రో వర్గానికి చెందినవారు. ఇక్కడ స్థానికంగా మాట్లాడే భాషల సంఖ్య 30 కన్నా ఎక్కువ. వీరి అధికార భాషలు ఇంగ్లీష్ మరియు స్వాహేలి. ఈ దేశంలో క్రిస్టియన్లు, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ దేశ కరెన్సీ ఉగాండా షిల్లింగ్స్. దేశ రాజధాని కంపాలా. ఈ దేశ వైశాల్యం 241,038 sq km.
యువజనాభా ఎక్కువున్న దేశాల్లో ఇదొకటి. జనాభా మొత్తంలో 70 శాతం మంది 25 సంవత్సరాల లోపున్నవారే. (2018)
ఈ దేశ జెండాలోని నలుపు, పసుపు, ఎరుపు రంగులు ఉగాండా ప్రజలకూ, సూర్యకాంతికీ, ప్రజల మధ్య ఉండే సోదరభావానికీ సూచికలు.
ఈ దేశంలో ఎక్కడపడితే అక్కడ నడవడానికి వీలు ఉండదు. కొన్ని ప్రదేశాల్లో నడకకు అనుమతించరు. చాలా వూళ్లలో ప్రయాణికుల కోసం ‘బోడా బోడా’ అనే మోటార్ సైకిల్ టాక్సీలు ఉంటాయి. ఇవి అత్యంత వేగంగా దూసుకెళుతూ కొత్త వారిని చాలా భయపెట్టేలా ఉంటాయి.
ప్రపంచంలో అతి పొడవైన నైలు నది పుట్టింది ఈ దేశంలోనే. గొరిల్లాలకు ఈ దేశం పేరు పొందినది. ప్రపంచం మొత్తంలో ఉన్న 880 మౌంటెన్ గొరిల్లాల్లో సగం ఈ దేశంలోనే ఉన్నాయి.
ఉగండాలో జలవనరులు ఎక్కువ. వర్షం పుష్కలంగా కురుస్తుంది. వైట్ నైల్ నది, విక్టోరియయా సరస్సు,, ఆల్ బర్ట్ సరస్సు నీటివనరులు.
ఉగాండా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. కర్రపెండలం, మొక్కజొన్న, జొనన, వరుశెనగ, కు, గగాకు, కాఫీ, అరటి, ప్రత్తి, బంగాళా దుంపలు, తేయాకు మొదలగునవి ఇక్కడ పండిస్తారు. పశుపోషణ కూడా ఎక్కువ. ఈ దేశ ప్రజలు చెట్లను ఎక్కువగా ఇష్టపడతారు. చెట్లను నరికివేస్తే, తప్పకుండా మూడు మొక్కలు నాటాల్సిందే. రకరకాల అరటిపండ్లు పండుతాయి. అనాస పండ్లకు ఈ దేశం ప్రసిద్ధి.
ఉగాండా మంచి పర్యాటక ప్రాంతం కూడా. ఏటా ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పది లక్షలకుపైనే. ఇక్కడ ఆడవాళ్లు పొట్టి దుస్తులను వేసుకోవడం తప్పుగా భావిస్తారు. తీవ్రమైన ప్రయత్నాల వలన HIV/AIDS నుండి విజయం పొందిన దేశం ఉగాండా