Zambia…..జాంబియా... దక్షిణ ఆఫ్రికాలోని చిన్న దేశం.భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే దేశం. ఉత్తరం వైపున కాంగో, టాంజానియా, తూర్పున మలవి, మొజాంబిక్, జింబాబ్వే, బోట్స్ వానా, దక్షిణాన నమీబియా, పడమర అంగోలా దేశాలు కలిగి ఉన్నది.. జాంబేజీ నది ఈ దేశం గుండా ప్రవహించటం వలన ఈ దేశానికి జాంబియా అనే పేరు వచ్చింది. ఈ నది మీద నిర్మించిన కరీబా డాం ప్రపంచంలోని పెద్ద డాంలలో ఒకటి. ఇక్కడ జల విద్యుత్ కుడా ఉత్పత్తి జరుగుతుంది. కరీబా డాం జాంబియా, జింబాబ్వే ఉమ్మడి నిర్వహణలో ఉంది. రెండుదేశాలకు పంటనీటిని అందిస్తుంది. కాంగో నది, కపూయీ నది, లౌపులా నది మేట్వారు సరస్స ప్రధాన జలవనరులను అందిస్తాయి. 1964 కి ముందు ఈ దేశాన్ని ఉత్తర రొడేషియా అని పిలిచేవారు. 1964లో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.
జాంబియా రాజధాని లుసాకా...వీరి భాష ఆంగ్లం. కరెన్సీ...జాంబియన్ క్వాచా. స్థానిక భాషలు... బెంబ, . నియాంజ, లోజి, బోంగా, లుండా, లువలే, కవొండే అనేవి. ఈ దేశం క్రిస్టియన్ దేశం. క్రిస్టయన్ల తరువాత కొద్దిగా ముస్లింలు, హిందువులు, స్థానిక మతాల వారు ఉన్నారు. ఈ దేశ వైశాల్యం 752,614 sq kmజ. ప్రజలలో 70 శాతం మంది ఆదిమ తెగలకు చెందిన నీగ్రోలు. వీరు ఎనిమిది మాండలిక భాషలను మాట్లాడుతారు. జాంబియా విస్తీర్ణం7,52,614 చ.కి.మీ.
జాంబియా ప్రకృతి వింతలకు పేరు. వందలాది నదులు, అందమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందిన దేశం. ఈ దేశంలో వేటాడటం... చెట్లను నరకటం నిషిద్ధం. ఈ దేశంలో ఇనుము, రాగి గనులు ఎక్కువ. ఈ దేశంలో ఎక్కువమంది జనం పట్టణ ప్రాంతాలలోనే నివసిస్తారు.
అడవి జంతువులు ఎక్కువ... ఏనుగులు, చిరుతలు, అడవి దున్నలు, ఖడ్గమృగాలు, జిరాఫీలు, హైనాలు, జీబ్రాలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి.
ప్రపంచంలతోనే అతి పెద్ద జలపాతంగా పేరుపొందిన విక్టోరియా జలపాతం ‘విక్టోరియా ఫాల్స్’ ఈ దేశంలోనే ఉంది. ఈ జలపాతం వెడల్పు 5,600 అడుగులు. రాగి ఖనిజం పుష్కలంగా లభించడం చేత ఈ దేశం సుసంపన్నమైంది.
పొగాకు, ప్రత్తి, మొక్కజొన్న, కర్రపెండలం, వేరుసెనగ, చిరుధాన్యాలు, చెరకు మొదలగు పంటలు పండిస్తారు. రాగి, సీసం, జింకు గనులున్నాయి. మాంగనీసు, కోబాల్టు, యురేనియం నిక్షేపాలు కూడా కలవు. కరీబా సరస్సు ప్రాంతంలో నేలబొగ్గు గనులు కలవు.
కపూయీ జాతీయ పార్క్ మంచి పర్యాటక ప్రాంతం.