ఆసియా ఖండం మధ్యలో ఉన్న స్వతంత్ర దేశం. ఈ దేశానికి చుట్టూ భూభాగాలే. ఇరాన్, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్, తజికిస్థాన్, చైనా దేశాలు దీనికి సరిహద్దులు.
అఫ్గానిస్థాన్లో తీవ్రమైన అంతర్యుద్ధాలు, తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువ. .అఫ్గానిస్థాన్ విదేశీదాడులతోనూ దారుణంగా నష్టపోయిందీ. ఇప్పటికీ (2019) రాజకీయ కల్లోలం కొనసాగుతూనే ఉన్నది. ఈ దేశస్థులు సంస్కృతికి ప్రాముఖ్యం ఇస్తారు. ఇక్కడ సాహిత్యానికి ప్రాధాన్యం ఉంటుంది. ఇసుక నేలలు ఎక్కువ. .
ఇక్కడి ప్రజల్లో 99 శాతం మంది ఇస్లాం మతస్థులే. 1919లో ఆగస్టు 19న బ్రిటన్ నుంచి ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. .
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ . ఈ దేశ విస్తీర్ణం 6,52,864 చదరపు కిలోమీటర్లు
వీరి భాషలు: పష్తూ, దారి (పర్షియన్) అఫ్గానిస్థాన్ కరెన్సీ అఫ్గానీ. ఈ దేశంలో 14 తెగలున్నాయి. తీవ్రంగా విద్యుత్తు కొరత ఉన్న దేశాల్లో ఇదీ ఒకటి. ఈ దేశంలో శుక్రవారం దుకాణాలకు, వ్యాపారాలకు సెలవు. .
అఫ్గానిస్థాన్ అంటే అఫ్గానుల ప్రదేశం అని అర్థమట. .
ఈ దేశ జాతీయ ఆట ‘బుజ్కెషి’. దీన్నే గోట్ గ్రాబింగ్ అని కూడా అంటారు. ఈ ఆట కాస్త ప్రమాదకరంగా ఉంటుంది. రెండు జట్లుగా ఉండే ఈ ఆటలో గుర్రపు సవారీ చేస్తూ మేకను పట్టుకోవాలి. కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ ఆట ప్రాచుర్యంలో ఉంది. .
వాతావరణం : ఇక్కడ వేసవి కాలంలో చాలా వేడిగానూ... చలికాలంలో చాలా చల్లగానూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చిన్న భూకంపాలు తరచూ వస్తుంటాయి. పర్యావరణ మార్పుల వల్ల గడిచిన 20 ఏళ్లలో ఎక్కువ మొత్తంలో అడవులు నశించాయి.
దేశంలో కొత్త సంవత్సరాన్ని‘నౌరోజ్’ అంటారు. మార్చి 21న చేసుకుంటారీ వేడుక. ఒక దగ్గర చేరి వేడుకలు చేసుకుంటారు. భారీ జెండాలను ఎగరవేస్తారు. .
ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడతారు. వరి, జొన్న, ప్రత్తి, సుగంధ ద్రవ్యాలు, గోధుమ, పుగాకు పండిస్తారు. సహజవాయువులు, చమురు ప్రధాన వనరులు. .
ఎక్కువగా పుచ్చకాయ, దానిమ్మ, ద్రాక్ష, ఖుబానీ (యాప్రికాట్) పండ్లను ఎగుమతి చేస్తుందీ దేశం. అఫ్గానిస్థాన్ రగ్గులకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. అక్షరాస్యత మగ వారిలో 52 శాతం, ఆడవారిలో 24 శాతం ఉందీ దేశంలో. .
ఇక్కడి ‘బమియన్’ గుహలు ఎంతో ప్రాచీనమైనవి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆయిల్ పెయింటింగ్స్కి నిలయమివి. ఈ పెయింటింగ్స్... క్రీస్తుపూర్వం 650 ఏళ్లనాటివి. ప్రపంచంలో అతిపెద్ద బుద్ధ విగ్రహాలు ఇక్కడే ఉండేవి. ఈ బమియన్ బుద్ధ విగ్రహాలను తాలిబాన్లు 2001లో ధ్వంసం చేశారు.
మంచు చిరుత, ఎగిరే ఎర్ర ఉడత వంటి ప్రత్యేకమైన జీవుల్ని ఈ దేశంలో చూడవచ్చు