header

Bahrain / బహ్రేన్

Bahrain / బహ్రేన్

33 చిన్న చిన్న దీవులతో ఉన్న బహ్రేన్ అరేబియా సింధుశాఖలో ఉన్నది. రాజవంశీయుల పాలనలో ఉంది. 1971 సం.లో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. అనేక దీవుల సముదాయం బహ్రేన్. ఈ దీవులలో బహ్రేన్ పెద్దదీవి. ఈ దీవి పేరుతోనే ఈ దేశానికి బహ్రేన్ అనే పేరు వచ్చింది. బహ్రేన్ రాజధాని మనామా. వీరి అధికార భాష అరబ్బీ. విస్తీర్ణం 690 చ.కి.మీ. ప్రజలు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతారు. ప్రజలలో అరబ్బులు 68 శాతం, పర్షియన్, ఇండియన్, పాకీస్తానీయులు 25 శాతం మంది ఉన్నారు. ప్రజలలో 85 శాతం మంది ముస్లింలే.
అపారంగా ఉన్న పెట్రోలు నిక్షేపాల వలన చమురు ఎగుమతులతో ఈ దేశం సుసంపన్నంగా మారింది.
ఖర్జూరం, పండ్లు, కూరగాయలు, వ్యవసాయోత్పులు. పశుపోషణ, కోళ్ల పెంపకం కూడా ఉన్నాయి. ప్రజల జీవన ప్రమాణం చాలా ఎక్కువ