బంగ్లాదేశ్... భారతదేశానికి పొరుగు దేశం. ఉత్తర, తూర్పు, పడమర దిక్కుల్లో భారత దేశ సరిహద్దుల్ని, ఆగ్నేయంలో మయన్మార్ దేశాలు ఉన్నాయు ఈ దేశానికి దక్షిణ దిశలో బంగాళాఖాతం ఉంటుంది.
బంగాలదేశ్ రాజధాని ఢాకా. దేశ విస్తీర్ణం: 1,47,610 చదరపు కిలోమీటర్లు. వీరి అధికారిక భాష బెంగాలీ. వీరి కరెన్సీ: టాకా. 1947 సంవత్సరానికి ముందు ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ స్వతంత్రరాజ్యంగా లేదు. 1947 సం.లో భారతదేశం నుండి విడిపోయిన పాకిస్తాన్ లో భాగంగా ఉండేది. తరువాత పాకిస్తాన్ నుండి విడిపోయి స్వతంత్రదేశంగా అవతరించింది
ఈ దేశ జెండాలో ఆకుపచ్చ రంగు దేశంలోని గ్రామాలకు, ఎరుపు రంగు వృత్తం స్వేచ్ఛకు గుర్తులు.
- పాఠకుల సంఖ్య జనాభాలో 15 శాతమే ఉన్నప్పటికీ ఇక్కడ 2,000 దినపత్రికలు, వార, మాసపత్రికలు ప్రచురితమవుతాయి.
- నాలుగు వేల ఏళ్ల క్రితం నాటి ప్రాచీన నాగరికత ఇక్కడిది. కొన్ని అధ్యయనాల ప్రకారం రాతి యుగంలోనే క్రీస్తుపూర్వం 20వేల సంవత్సరాల క్రితమే నాగరికత అభివృద్ధి చెందిందని చెబుతారు.
- బంగ్లాదేశ్ అంటే కంట్రీ ఆఫ్ బెంగాల్ అని అర్థం.
సగానికి పైగా జనాభా వృత్తి వ్యవసాయమే. రాజధాని ఢాకా 1608 సంవత్సరంలో ఏర్పడింది. కోటీ డెబ్బై లక్షల జనాభాతో ప్రపంచంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో ఒకటి. తీరం వెంబడి మాంగ్రూవ్ అడవులు ఎక్కువగా ఉంటాయి. స్వాతంత్య్రం పొందిన మార్చి 26ను జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దేశంలో భవన నిర్మాణానికి అవసరమైన రాయి లేదు. అందుకని ఇటుకల్నే ఎక్కువగా వాడుతారు. ఇటుక బట్టీలు దేశం పొడవునా విరివిగా ఉంటాయి. జనాభా పరంగా ప్రపంచంలో ఈ దేశం ఎనిమిదో స్థానంలో ఉంది. 200 ఎకరాల్లో నిర్మించిన ఇక్కడి జాతీయ పార్లమెంటరీ భవనం ఆ తరహా నిర్మాణాల్లో పెద్దది.
కబడ్డీ ఈ దేశ జాతీయ ఆట. మన జాతీయ గీతాన్ని రచించిన రవీంద్రనాథ్ ఠాగూరే ఈ బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రాశారు. ప్రకృతి వైపరీత్యాలు తీవ్రంగా సంభవిస్తాయిక్కడ. తరచూ తుపాన్లు, వరదలు వచ్చి ప్రాణ,ఆస్తి నష్టం కల్గజేస్తుంటాయి. ప్రపంచ ప్రఖ్యాత రాయల్ బెంగాల్ టైగర్ ఈ దేశ జాతీయ జంతువు. ఈ పులి గాండ్రింపు మూడు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుందిట.
ఇక్కడి కాక్స్‌స్ బజార్‌లోని తీరానికి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా ఉన్న సముద్ర తీరంగా పేరు. ఇది 120 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది.
బంగ్లాదేశ్ జనాలు ఎప్పుడోగానీ నవ్వరు. అలా అనీ వీరు స్నేహంగా ఉండరని కాదు. ఎక్కువగా నవ్వితే పరిపక్వతలేని వారిగా భావిస్తారని వారి ఉద్దేశం. ఇక్కడి మహస్థన్‌గాహ్ అనేది బంగ్లాదేశ్ అతి పురాతమైన ప్రాచీన నగరం. ఈ దేశ కరెన్సీ టాకా. బెంగాలీలో కరెన్సీ అని దీనర్థం.