header

Combodia(Camphuchia) కంపూచియా (కంబోడియా)

Combodia(Camphuchia) కంపూచియా (కంబోడియా)

కంపూచియా లేక కంబోడియా ఆగ్నేయ ఆసియాలోని ఒక చిన్న స్వతంత్ర దేశం. ఈ దేశానికి పూర్వ నామం క్మేర్ రిపబ్లిక్, రాజధాని నామ్ పెన్. పూర్యం కాంభోజ రాజ్యం అనే పేరుతో కూడా పిలిచేవారు. కంపూచియా విస్తీర్ణం 18,035 చ.కి.మీ. వీరి అధికార భాష క్మెర్ (కంబోడియా భాష). వీరి కరెన్సీ రియాల్. రాజధాని నగరం నామ్ పెన్. పూర్వం హిందూ సామ్రాజ్యమైనా ప్రస్తుతం ఈ దేశంలో బౌద్దమతం ప్రచారంలో ఉంది. 90 శాతం మంది ప్రజలు హీనయాన బౌద్దశాఖకు(తెరవాడ బుద్ధిజం) చెందినవారే.
ఈ దేశ చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్రతో సంబంధం కలిగి ఉంది. పూనాన్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండి క్రీ.శకం 7వ శతాబ్దం వరకు గొప్ప వైభవంతో వెలుగొందింది.
8వ శతాబ్ధం నుండి 14వ శతాబ్దం వరకూ భారతదేశంతో సత్సంబంధాలు కలిగి హిందూ బౌద్ద రాజ్యంగా ప్రాచుర్యం పొందింది. అప్పట్లో కంపూచియా రాజధాని అంగ్ కోర్ వాట్, ఆనాటి క్మెర్ చక్రవర్తులు నిర్మించిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంగ్ కోర్ వాట్ దేవాలయం, వాస్తు శిల్పసంపద నేటికీ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన అంగ్ కోర్ వాట్ దేవాలయంలో నిర్మించిన శిల్పాలలో భారతదేశ దేవతల రూపాలు గోచరిస్తాయి.
1100 సంవత్సరం నాటికి నేటి లావోస్, ధాయ్ లాండ్, వియత్నాంలు కంపూచియాలో భాగంగా ఉండేవి.
తరువాత కంపూచియా పతనమైనపుడు రాజధానినిని నామ్ పెన్ కు తరలించారు.
19 వ శతాబ్దంలో కంపూచియాను ఫ్రెంచ్ వారు ఆక్రమించుకున్నారు. ద్వితీయ ప్రపంచ యుద్దం తరువాత 1953వ సం.లో ఫ్రెంచ్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది.
మికాంక్ నది కంపూచియాకు ప్రధాన జలవనరులను అందిస్తుంది. భూమి కూడా సారవంతమైనది. వరి, రబ్బరు, సోయా చిక్కుడు ప్రధానమైన పంటలు. పశుసంపద కూడా ఎక్కువే.
సిమెంట్, కాగితం, పైవుడ్, జవుళీ, మత్యపరిశ్రమలు ముఖ్యమైనవి.