ఆసియా, ఆఫ్రికాకి, యూరప్ ఖండాలకు చాలా సమీపంలో ఉన్న స్వతంత్ర దేశం సైప్రస్. మధ్యధరా సముద్రానికి తూర్పు వైపున ఉంది. క్రీ.పూర్వం 7000 ఏళ్లనాటి నుండే ఈ దేశంలో నాగరికత వర్థిల్లినట్లు చరిత్ర తెలుపుతుంది. ఇంత వైభవం కల దేశం కూడా 1960 సం.లో స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
ఈ దేశాన్ని గ్రీక్ భాషలో ‘కైప్రియారీ డెమోక్రటిక్’ అని పిలుస్తారు. సైప్రస్ లో కొంత భూభాగం టర్కీ ఆక్రమణలో ఉంది.
సైప్రస్ విస్తీర్ణం 5,896 చ.కి. మాత్రమే.. రాజధాని నగరం నికోసియా. వీరి అధికార భాషలు గ్రీక్, టర్కిష్. పైప్రస్ ప్రజలంతా గ్రీక్ జాతికి చెందినవారే. వీరు గ్రీక్ ఆర్తడాక్స్ క్రైస్తవ మతాన్ని పాటిస్తారు.
ఓహియారి జోస్, సెరికిస్, పెడియోస్ నదులు మరియు కౌకియా సరస్సులు సైప్రస్ కు ప్రధాన నీటివనరులు. గోధుమ, బార్లీ, బంగాళాదుంపలు, గ్రేప్ ఫ్రూట్స్, ద్రాక్ష, గజనిమ్మ, నారింజ మొదలగునవి వ్యవసాయ ఉత్పత్తులు.
రాగి ఇనుపరాయి, జిప్సమ్, ఆస్బెస్టాస్, ఈ దేశం అని ఖనిజ సంపదలు.
సిమెంట్, ద్రాక్షా సారాయి, జవుళీ, పాదరక్షలు, దుస్తులు, కలప సామాగ్రి, ఆలివ్ నూనె, సమెంట్ సైప్రస్ లోని ముఖ్యమైన పరిశ్రమలు. ప్రాచీన నాగరికత చెందిన శల్పాలు, కళాఖండాలు ఎక్కువగా ఉన్న దేశం సైప్రస్. ఈ దేశం పర్యాటకంగా కూడా పేరు పొందింది.