header

India / భారతదేశం

India / భారతదేశం

భారత దేశం ఆసియాలోని పెద్ద దేశాలలో ఒకటి నూటఇరవై కోట్లకు పైగాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. (మొదటిది చైనా) వైశాల్యములో ప్రపంచంలో ఏడవది.
ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మరియు అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటి. భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం. భారతదేశ కరెన్సీ రూపాయలు. భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న భాషలు హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, తమిళం, అస్సామీ, గుజరాతీ, పంజాబీ, ఒరియా ఇంకా అనేక భాషలు మాట్లాడుతారు. దేశంలో గుర్తించ బడిన భాషలు 22. ఇంకా గుర్తింపు లేని అనేక భాషలు కలవు. హిందూ, సిక్, ముస్లిం, క్రిస్టియన్ ఇంకా అనేక మతాల వారు ఐకమత్యంతో నివసిస్తున్నారు.
భారతదేశం అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశం. ఇండియా రాజధాని ఢిల్లీ. భారతదేశం 29 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక ఫెడరల్ రాజ్యాంగ గణతంత్రం.
దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉన్న దేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారులు కలవు. దక్షిణాన హిందూ మహాసముద్రం, నైరుతిన అరేబియా సముద్రం, మరియు ఆగ్నేయాన బంగాళాఖాతం, ఉత్తరదిశలో హిమాలయ పర్వతాలు ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది
పురాతన నాగరికతలకు పుట్టిల్లు. అనేక వేల సంవత్సరాల చరిత్ర కల దేశం. హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కుమతాలకు భారత దేశమే జన్మస్ధానం.
ఇంత పెద్ద దేశంలో రాజుల మధ్య ఐకమత్యం లేక పోవటం వలన గజనీ, ఘోరీ, అలగ్జాండర్, తురుష్కల దండయాత్రలకు గురై నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రంతో పాటు అపార సంపద కొల్లగొట్టబడినది. తరువాత రాజులలో ఐకమత్యం లేక పోవటం వలన ఇంత పెద్ద దేశాన్ని కూడా 18 వ శతాబ్దం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అక్రమంగా ఆక్రమించటం వలన భారతదేశం బ్రిటిష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది. 1857 సం. సిపాయిల తిరుగుబాటు తరువాత 19 వ శతాబ్దం మధ్య నుండి నేరుగా యునైటెడ్ కింగ్డమ్ నుండే పాలించబడింది. మహాత్మా గాంధీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం చేసిన అహింసాయుత పోరాటం తర్వాత 1947 ఆగస్ట్ 15 వ తేదీన ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి .భారత దేశాన్ని కొత్తగా పారిశ్రామీకరణ జరిగిన దేశంగా భావిస్తారు ప్రపంచంలో అతిపెద్ద సైన్యం కలిగి ఉన్న మూడవ దేశం.
భారత దేశ జాతీయ పతాకము త్రివర్ణ పతాకము. జాతీయ చిహ్నం మూడు తలల సింహపు బొమ్మ. జాతీయ గీతం జనగణమన.... జాతీయ గేయం వందేమాతరం....
ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వరి, గోధుమ, పొగాకు, ప్రత్తి, అపరాలు, చిరుధాన్యాలు, చెరకు, పొద్దు తిరుగుడు గింజలు, వేరుశెనగ, కాఫీ, తేయాకు ముఖ్యమైన పంటలు. పాడి పరిశ్రమ, పశువుల పెంపకం కూడా ఎక్కువగా ఉంది. గంగ, గోదావరి, యమున, కావేరి, కృష్ణ ఇంకా అనేక జీవనదులు మరియు చిన్న చిన్న నదులు కలవు. అపారమైన జలరాశులున్న సరస్సులు చెరువులు కలవు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ ఇంకా అనేక చారిత్రాత్మక నిర్మాణాలు కలవు. ప్రపంచలోనే పేరు పొందిన జాతీయ నాయకులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహుదూర్ శాస్త్రి, సుభాష్ చంద్రబోస్ వంటి వారికి జన్మనిచ్చిన దేశం.
ఆద్యాత్మికంగా కూడా పేరు పొందినది భారతదేశం. వేదాలు, భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత ఆవిర్భవించిన దేశం. బౌద్ధమతం, సిక్కుమతం, జైనమతం ఆవిర్భవించిన దేశం కూడా.
రమణ మహర్షి, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఆదిశంకరాచార్యులు మొదలగు ఆధ్యాత్మిక గురువులకు జన్మస్థానం భారతదేశం. ప్రపంచ ప్రసిద్ది చెందిన కోహినూర్ వజ్రం, నెమలి సింహానం భారతదేశానికి చెందినవే. భారత దేశం మంచి పర్యాటక దేశం కూడా. ప్రకృతి దృశ్వాలతో, లోయలతో, పచ్చదనంతో ఉన్న అనేక ప్రాంతాలు ఉన్నాయి. భారత దేశం పర్యాటక పరంగా కూడా పేరుపొందిన దేశం.