header

Indonesia….ఇండోనేషియా


ఇండోనేషియా... ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప దేశం. ఆగ్నేయ ఆసియాలోని ఈ ద్వీప దేశంలో మొత్తం 17,800 ద్వీపాలుంటాయి. ఇందులో సగం ద్వీపాలకు ఇంకా పేర్లే లేవు. హిందూ, పసిఫిక్‌ సముద్రాల మధ్య ఉన్నది.
ఇండోనేషియా రాజధాని జకార్తా. దేశ విస్తీర్ణం 19,04,569 చదరపు కిలోమీటర్లు. ఇక్కడి అధికార భాష ఇండోనేషియన్ ఐనప్పటికీ ఇక్కడి ప్రజలు దాదాపు 600 భాషలు, మాండలికాల్లో మాట్లాడుతారు. ఈ దేశ కరెన్సీ రుపయా
వీరి జెండాలోని ఎరుపు రంగు మనిషి రక్తానికి, తెలుపు రంగు ఆత్మకు గుర్తులు.
ఈ దేశం ఎన్నో అరుదైన జీవజాతులకు నిలయం. 2010లో ఇక్కడ 200 రకాల కొత్త జీవుల్ని గుర్తించారు. జవన్‌ రైనో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.
ప్రపంచంలో రెండో అతి పెద్ద తీర ప్రాంతం ఉండేది ఈ దేశానికే. ప్రపంచంలో అతి పెద్ద బంగారు గని ‘గ్రాస్‌బెర్గ్‌’ ఇక్కడిదే. మూడో అతి పెద్ద రాగి గని కూడా ఈ దేశంలోనే ఉంది.
జీవవైవిధ్యంలో రెండో స్థానంలో ఉందది. అతి పెద్ద బల్లి జాతికి చెందిన ‘కొమడో డ్రాగన్‌’ ఈ దేశ జాతీయ జంతువు. ఈ దేశంలో సగభాగం అడవులతో నిండి ఉంటుంది.
ప్రపంచంలో అతి పెద్ద పువ్వు ‘రాఫ్లీసియా ఆర్నాల్డి’ని ఇక్కడ చూడొచ్చు. ఈ పూల రేకులు ఒకటిన్నర అడుగుల పొడవు, అంగుళం మందంతో ఉంటాయి.
తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగే పసిఫిక్‌ ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’లో ఈ దేశమూ ఓ భాగం. మొత్తం 400 అగ్ని పర్వతాలుంటే వాటిలో 150 క్రియాశీలకమైనవి. ప్రపంచంలో ఇలాంటి ప్రమాదకర అగ్నిపర్వతాల్లో 75 శాతం ఇక్కడే ఉన్నాయి.
ఇక్కడ ఓ ప్రత్యేకమైన అగ్నిపర్వతం ఉంటుంది. దీని నుంచి వచ్చే అగ్నిజ్వాలలు నీలం రంగులో ఉంటాయి.. అతి పెద్ద బుద్ధుడి గుడి ‘బొరొబుడుర్‌’ ఉన్నది ఇక్కడే. 504 బుద్ధుని విగ్రహాలతో ఉంటుందీ ఆలయం.
తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల విస్పోటనాలు జరిగే ఫసిఫిక్ కు చెందిన ’రింగ్ ఆఫ్ ఫైర్‘ ప్రాంతంలో ఈ దేశం కూడా ఒకభాగమే. మొత్తం 400 అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిలో 150 పర్వతాలు క్రియాశీలకమైనవి అంటే పేలటానికి ఆస్కారమున్నవి. ప్రపంచంలోని ఇలాంటి అగ్నిపర్వతాలలో 75 శాతం ఇక్కడే ఉన్నాయి.
అతి పెద్ద గుడి ‘బోరోబుడుర్ ఈ దేశంలోనే ఉన్నది. ఈ దేవాలయంలో 504 బుద్ధ విగ్రహాలు ఉన్నాయి.
ఇండోనేషియాలో వ్యభిచారాన్ని గౌరవం, నైతికతలకు భంగం కలిగించే నేరంగా పరిగణిస్తారు. అయినా సరే, ఇండోనేషియా సెక్స్ టూరిజంలో ముందుండటం గమనార్హం. ఈ వ్యభిచారాలకు ఆన్ లైన్ సోషల్ మీడియాలే వేదికలు. ఈ దేశంలో కూడా మైనర్లను బలవంతంగా వ్యభిచారంలోకి లాగుతున్నారు. అయితే, ఇక్కడి చట్టాలు వారికి ఎలాంటి రక్షణ కల్పించలేక చేతులెత్తేశాయి.