పర్షియన్ సింధుశాఖ ముఖ ద్వారంలోని స్వతంత్ర దేశం. ఇది అరబ్ దేశం. అరబ్బీలో ఇరాక్ ను ఆల్-జు-మ్హూరియా ఆల్ – ఇరాఖియా అంటారు. యాఫ్రటీస్ నదీ లోయలలో క్రీ.పూర్వం 3000 సంవత్సరాల క్రితం వెలసిన బాబిలోనియా, అస్సీరియా, సుమేరు నాగరికతలతో వర్థిల్లిన దేశం. ఈ దేశాన్నే పూర్వకాలంలో మెసపొటేమియా అని అంటారు.
ఈ దేశ విస్తీర్ణం 4,38,317 చ.కి.మీ. రాజధాని బాగ్దాద్. వీరి అధికార భాష అరబ్బీ మరియు కుర్దిష్. ఈ దేశం ముస్లిం దేశం. ముస్లింలలో షియా తెగల వారు 54 శాతం, సున్నీలు 42 శాతం మంది ఉన్నారు. వీరి కరెన్సీ ఇరాకీ దీనార్ లు.
టైగ్రీస్, యూఫ్రటీస్ నదులు ఈ దేశంలో ప్రవహిస్తున్నాయి. బార్లీ, వరి, చిరుధాన్యాలు, గోధుమ, ప్రత్తి, ఖర్జూరాలు, పొగాకు ఈ దేశంలో పండుతాయి. ఉన్ని, నూలు బట్టల పరిశ్రమలు ఉన్నాయి. పెట్రోలు లభిస్తుంది.