header

Israel…..ఇజ్రాయెల్

Israel…..ఇజ్రాయెల్

ఈ దేశానికి ప్రాచీన చరిత్ర లేదు. ప్రపంచంలో చెల్లా చెదురుగా ఉన్న యూదులంతా కలసి 1948 సం.లో ఈ ప్రాంతానికి చేరి ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఏర్పరుచుకున్నారు. బైబిల్ నాటి పాలస్తీనా యూదుల రాజ్యం కానీ పలు దాడులకు గురై యూదులు చెల్లాచెదురై ప్రపంచం నలుమూలలకు వెళ్లిపోయారు. మతద్వేషానికి కూడా గురైయ్యారు. 1800 సంవత్సరం నుండి తమ జన్మభూమికై పోరాటం సాగించి చివరకు 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్ ను ఏర్పరచుకొని స్వతంత్ర ప్రతిపత్తిని సాధించగలిగారు.
వీరికి దేశభక్తి, జాతీయ భావం ఎక్కువ. దీనితోనే ఈ దేశ పౌరులంతా కష్టించి పనిచేసి తమ దేశపు ఆర్ధిక స్థాయిని పెంచుకోవటం జరిగింది. దీనితో ఈ ప్రపంచంలోనే అత్యధిక జీవన ప్రమాణాలను అందుకోగలిగారు.
ఈ దేశ విస్తీర్ణం 20, 700 కి.మీ. దేశ రాజధాని జెరుసలేం. ఇజ్రయెల్ లోని ఇతర ప్రధాన పట్టణాలు టెల్ అవీస్, యఫో, హైఫా, హోలాన్, బట్ యామ్. ఇజ్రాయెల్ లో అధికార భాష హిబ్రూ..అరబిక్. వీరి కరెన్సీ న్యూ షెకెల్. ప్రజలలో యూదు మతస్థులు ఎక్కువ. ముస్లిం మతస్థులు కొద్ది శాతం మంది ఉన్నారు.
మృతసముద్రం ఇజ్రయెల్ లోనే ఉంది. ఈ దేశంలో నీటి ఎద్దడి ఎక్కువ. కానీ వీరు శాస్త్రవిజ్ఞానంతో సముద్రపు నీటిని శుద్ధిచేసి మంచినీరుగా మార్చి నారింజ జాతి పండ్లను పండించి ఎగుమతి చేస్తున్నారు.
పాడిపరిశ్రమ పాడిపరిశ్రమ, కోళ్ల పరిశ్రలు ఎక్కువ. జవుళీ. వజ్రాలు , రాగి, ఖనిజం, మొదలగు పరిశ్రమలు ఉన్నాయి.