1991 సంవత్సరానికి ముందు కజకిస్తాన్ అఖంఢ రష్యాలో ఒక భాగం. 1991సం.లో రష్యా విచ్ఛినం అయిన తరువాత చివరిగా స్వాతంత్ర్యం ప్రకటించుకున్న దేశం.
ఈ దేశ రాజధాని ఆస్తానా. వీరి భాషలు కజక్ మరియు టర్కీ రష్యన్ భాష కూడా ఇక్కడి ప్రజలు మాట్లాడుతారు. ఈ దేశ కరెన్సీ టుంజ్ లు. 76 శాతం మంది ముస్లింలు 24 శాతం మంది క్రిస్టియన్ లు ఈ దేశంలో ఉన్నారు. .
రష్యా, కిర్గిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు చైనాలు కజకిస్తాన్ కు సరిహద్దు దేశాలు. .
బార్లీ, పత్తి, గోధుమలు, వరి పండిస్తారు. పశుపోషణ కూడా కలదు.
యూరేనియమ్, క్రోం, లీడ్, రాగి, మాంగనీస్, బొగ్గు, మొదలగు ఖనిజ సంపదలు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్ మరియు సహజవాయువు పుష్కలంగా లభిస్తాయి. పెంపుడు జంతువుల మాంసం, రోట్టెలు, బ్లాక్ టీ, పాలు వీరికి ఇష్టమైన ఆహారాలు.