కువైట్ పశ్చమ ఆసియాలోని ఒక చిన్న దేశం. 17,820 చదరపు కిలీమీటర్ల వైశాల్యం కలిగి ఉన్నది. కువైట్ అరబిక్ దేశం. ఈ అరబిక్ దేశం మొత్తం 9 దీవుల సముదాయం. రాజధాని కువైట్ నగరం. వీరి భాష అరబ్బీ. వీరి కరెన్సీ పేరు కువైటీ దీనార్స్. ఇవి వివిధ దేశాల కరెన్సీ కన్నా చాలా విలువైనవి. ఒక కువైట్ దీనార్ దాదాపు 211 భారతదేశపు రూపాయలకు సమానం (2017 మారకపువిలువ ప్రకారం). పెట్రోల్ నిల్వలు అపారంగా ఉన్న సంపన్న దేశం.
కువైట్ కు ఉత్తర, పశ్చిమ దిశలలో ఇరాక్ దేశం మరియు దక్షిణ దిశలో సౌదీ అరేబియా దేశాలున్నాయి.
కువైట్ లో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం. అంతే కాదు అత్యధిక ఉష్ణోగ్రత గల దేశం. జూన్ మరియు ఆగష్ట్ నెలలో వేడి విపరీతంగా ఉంటుంది. దాదాపు 50 సెల్సియస్ డిగ్రీలు దాటుతుంది. సంవత్సరమంతా ఇసుక తుఫానులు వస్తుంటాయి.
కువైట్ 1961 సంవత్సరంలో బ్రిటన్ నుండి స్వాతంత్ర్వం పొందింది. వీరి ప్రధాన ఆదాయం ఇంధన వనరుల ద్వారా వస్తుంది. ప్రపంచదేశాలలో వాడే పెట్రోలియం 20 శాతం ఇక్కడి నుండే వస్తుంది.
కువైట్ లో మంచినీటి లభ్యత లేదు. మంచినీటి సరస్సులు, వనరులు కానీ లేవు. సముద్రపు నీటి నుండి ఉప్పును వేరుచేసి తాగటానికి, అవసరాలకు వాడుకుంటారు. కొంతమేర మంచినీటిని ఇతరదేశాలనుండి దిగుమతి చేసుకుంటారు.
కువైట్ ప్రపంచంలోని సంపన్న దేశాలలో ఒకటి. కువైట్ ఆర్థికంగా బలమైన దేశం కనుక ఇతర దేశాల నుండి పనుల కోసం విదేశీయులు ఎక్కువగా వెళుతుంటారు.
ఈ దేశ జాతీయ పక్షి ఫాల్కన్. కువైట్ కరెన్సీ నోట్లపై. స్టాంపులపై ఫాల్కన్ బొమ్మ కనిపిస్తుంది.