ఆగ్నేయ ఆసియాలో పర్వతాలతో నిండిన దేశం లావోస్.ఈ దేశాన్ని లావు పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని కూడా పిలుస్తారు. ఈ దేశానికి దక్షిణాన ధాయ్ లాండ్, కంపూచియా, తూర్పున వియత్నాం, పశ్చిమాన. ఉత్తరాన మయన్మార్ దేశాలున్నాయి.
లావోస్ విస్తీర్ణం2,36,800 కి.మీ. రాజధాని వియెంటినే. వీరి భాష లావు. వీరి కరెన్సీ కిప్. ఆదిమ భాషలు కూడా మాట్లాడుతారు. బౌద్ద మతస్తులు 58 శాతం మంది ఉన్నారు. ఆదిమ జాతుల మతాలు పాటించేవారు 34 శాతం ఉన్నారు.
మీకాంగ్ నదీలోయ ప్రాంతం సారవంతమైనది. వరి ప్రధానమైన పంట. మొక్కజొన్న. చెరకు, పొగాకు, కాఫీ, తేయాకు, నారింజ పంటలు పండిస్తారు. కర్రపెండలం, అనాస, ఉల్లి, ఏలకులు, మెంజాయిన్ ఓషధి, చింకోనా, నల్లమందు వీటిని పండించి ఎగుమతి చేస్తారు.
పశువుల పెంపకం, పట్టు పరిశ్రమ, షెల్లాక్, తోలు పరిశ్రమ, మట్టిపాత్రల పరిశ్రమలు ఉన్నాయి. జిప్సమ్, రాతి ఉప్పు, తగరం, జింకు ఖనిజ నిక్షేపాలు దొరకుతాయి. టేకు కలప కూడా లభిస్తుంది. లావోస్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దేశం.