header

Lebanon / లెబనాన్

Lebanon / లెబనాన్

ఫశ్చిమ ఆసియాలో మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఉన్న స్వతంత్ర దేశం లెబనాన్. వైభవోపేతమైన చరిత్ర కలిగిన దేశం. ఫోనీషియన్ ల పాలనలో ఈ దేశం అత్యంత వైభవంగా వెలిగింది. లెబనాన్ కు ఉత్తరాన సిరియా, దక్షిణాన ఇజ్రాయేల్ కలవు.
లెబనాన్ వైశాల్యం 10230, చ.కి.మీ. రాజధాని బీరూట్. వీరి అధికార భాష అరబ్బీ. దీని తరువాత ఫ్రెంచ్, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతారు. వీరి కరెన్సీ లెబనీస్ లీరాలు. ప్రజలలో షియా ముస్లింలు 32 శాతం మంది, సున్నీ మతస్తులు 21 శాతం మంది. క్రైస్తవులు 41 శాతం మంది ఉన్నారు. ఈ దేశమంతా కొండలతో నిండి ఉంది. .
లితాని నది, ఒరెంటీస్ నది ముఖ్యమైన నదులు. ఇవి మధ్యధరా సముద్రంలో కలుస్తాయి. .
బార్లీ, మొక్కజొన్న, గోధుమ, ఆలివ్, పుచ్చ, దోస, ద్రాక్ష, యాపిల్, అరటి, నిమ్మ, నారింజ జాతుల పండ్లను పండిస్తారు. ఉప్పు, జిప్సమ్ ఆహార పదార్ధాలు, సిమెంట్, తోలు, జవుళీ ఈ దేశంలో ఉన్న పరిశ్రమలు. కలప కూడా లభిస్తుంది. మత్స్య పరిశ్రమ కూడా ఉంది. పర్యాటకం వలన కూడా దేశానికి ఆదాయం లభిస్తుంది.