భారతదేశానికి నైరుతీ దిశలో మరియు శ్రీలంకకు పశ్చిమాన ఉన్న చాలా చిన్న స్వతంత్ర ద్వీప దేశం మాల్ దీవులు. 2000 లకు పైగా ఉన్న ఈ పగడపు దీవులలో మాలే దీవి, హువేవీ దీవి, విల్లింగ్లీ దీవి కొంచెం పెద్దవి. కేవలం 21 దీవులలో మాత్రమే జనం ఉన్నారు.
మాల్దీవుల వైశాల్యం 298 చ.కి. మీ. రాజధాని మాలే. వీరి అధికార భాష దివేహీ. వీరి కరెన్సీ రుపయా ప్రజలు సున్నీ ఇస్లాం మతస్తులు.దీవులన్నీ 15 చ.కి.మీటర్లకు మించిలేవు.
ఉప్పునీటి కయ్యలు, తెల్ల ఇసుక తీరాలు ఎక్కువ. కొబ్బరి చెట్లు, పండ్ల చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. జలాధారాలు లేవు, వర్షాధారపు పంటలు మాత్రమే పండిస్తారు.
కొబ్బరి, అనాస, దానిమ్మ, బొప్పాయి, బ్రెడ్ ఫ్రూట్ దుంప జాతులను ఇక్కడ పండిస్తారు.
మత్స్య పరిశ్రమ ప్రజలకు ముఖ్యమైన జీవనాధారం.
పెద్ద పెద్ద పడవలలో చేపల వేట సాగిస్తారు. బొనిటో, టూనా వంటి చేపలను పట్టుకొని ఎండబెట్టి ఎగుమతి చేస్తారు. శ్రీలంకకు ఎక్కువగా ఎగుమతులుంటాయి.
పీచు పరిశ్రమ, క్వారీ గనులు. లక్కసామానులు, చాపలు మొదలగు వాటిని కుటీరపరిశ్రమలలో రూపొందిస్తారు. వరిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు.