ఇండియాకు చైనాకు మధ్య ఉన్న హిమాలయ పర్వతాలలో ఉన్న చిన్న దేశం నేపాల్. నేపాల్ రాజవంశీయుల పాలనలో ఉంది. ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఘుర్కా జాతి వారు.
నేపాల్ విస్తీర్ణం 1,47,181 చ.కి.మీ. నేపాల్ రాజధాని ఘాట్మాండ్. వీరి అధికార భాష నేపాలీ. వీరి కరెన్సీ నేపాల్ రూపాయలు. ఒకప్పుడు నేపాల్ ప్రపంచంలోనే ఏకైక హిందూ రాజ్యంగా ఉండేది. హిందూ మతస్తులు 89 శాతం మంది. బౌద్ద మతస్తులు 5 శాతం మంది నేపాల్ లో ఉన్నారు.
నేపాల్ అటవీ సంపదకు పేరు పొందినది. పర్వత సానువులలోనూ , దక్షిణ మైదానాలలోనూ వ్యవసాయం చేసి వరి, చెరకు, జొన్న, మొక్కజొన్న, నూనె గింజలు పండిస్తారు. పశువుల పెంపకం కూడా ఎక్కువే.
సున్నపు రాయి, మాగ్నపైట్, టాల్క్, గార్నెట్, ఖనిజాలు లభిస్తాయి.
ఈ దేశం నుండి ఓషదులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. ప్రపంచంలోనే మిక్కిలి ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరం నేపాల్ లోనే ఉంది. నేపాల్ పర్యాటక దేశం కూడా.