ఓమన్ దేశం అరేబియా ద్వీపకల్పంలో ఆగ్నేయ భాగంలో ఉన్న ఒక సంపన్న సుల్తాన్ దేశం. ఈ దేశ రాజధాని మస్కట్. వీరి అధికార భాష అరబ్బీ. ఈ దేశ విస్తీర్ణం 3,00,000 చ. కి.మీ. వీరి కరెన్సీ ఓమన్ రియాల్స్. ఓమన్ ముస్లిం దేశం.
ఈ దేశ జనాభాలో 15 శాతం మంది భారతీయులు ఉన్నారు. ఈ దేశంలోని బతీనా తీర ప్రాంతంలో వ్యయసాయ యోగ్యమైన భూములున్నాయి. పంటలు పుష్కలంగా పండుతాయి. గోధుమ, పుచ్చకాయలు, అరటి, మామిడి, ఉల్లి, ఖర్జూరం, పొగాకు, కందమూలలు పండుతాయి. పశుపోషణ, పశువుల పెంపకం కూడా ప్రజల జీవనోపాదులు
ఓమన్ లో పెట్రోల్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్ ఎగుమతుల వలన అపారంగా విదేశీ ద్రవ్యాన్ని సంపాదించుకుంటుంది.