సింగపూర్ ఆగ్నేయ ఆసియాలో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం. 1965 సం.లో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. జనసంఖ్య ఎక్కువగా గల దేశం. చైనా వారు ఎక్కువగా ఉన్నారు. నాల్గింట మూడు వంతులు చైనా వారే. వీరు వ్యాపార దక్షత గలవారని పేరు. వ్యాపారాలన్నీ వీరి చేతులమీదుగానే జరుగుతాయి. స్వాతంత్రం వచ్చిన తరువాత చాలా తక్కువ సంవత్సరాలలోనే ఈ దేశం అభివృద్ధి చెందింది. దీనికి కారణం ఈ దేశ నాయకత్వం మరియు ప్రజల సహకారం.
సింగపూర్ వైశాల్యం 622 చ.కి.మీ. రాజధాని పేరు సింగపూర్ సిటీ. వీరి అధికార భాషలు మలే, చైనీస్, తమిళం, ఇంగ్లీష్. ఈ దేశ కరెన్సీ సింగపూర్ డాలర్. వీరికి భూభాగం చాలా తక్కువ. సముద్రాన్ని కూడా పూడ్చివేసి కొంత భూభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఈ దేశంలో బౌద్ద మతస్తులు 27 శాతం మంది ఉన్నారు ఇస్లాం మతస్తులు 16 శాతం, టావోలు 29 శాతం మంది, క్రైస్తవులు 10 శాతం మంది, హిందువులు 4 శాతం మంది ఉన్నారు
సిందపూర్ ఆగ్నేయ దేశాలన్నిటికీ వాణిజ్య కేంద్రంగా పేరు పొందింది. చెరువులు, చిన్న చిన్న సరస్సులు ప్రధాన జలాధారాలు. కొబ్బరి తోటలు, పండ్ల తోటలు రబ్బరు, పొగాకు, కాయకూరలు పండిస్తారు. వరి, ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటారు.
మత్స్య పరిశ్రమ ఎక్కువ. ఎలక్ట్రానిక్ పరికరాలు, రవాణా వాహనాలు,, యంత్ర సామాగ్రి, ఔషధాలు, తగరపు సామాగ్రి, రబ్బరు, సుగంధ ద్రవ్యాలను శుద్ధి చేయటం మొదలగునవి ప్రధాన పరిశ్రమలు.
అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం కావటం వలన నౌకాపరిశ్రమ, మరమ్మత్తులు ఎక్కువ. సింగపూర్ హార్బర్ కు చిన్న పెద్ద నౌకలు సంవత్సరానికి 40,000 వేల దాకా వస్తూ పోతూ ఉంటాయి. ఈ హార్బర్ సహజ వనరులతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన నౌకాశ్రయం. నౌకా వ్యాపారానికి అనుకూలం.