header

South Korea…..దక్షిణ కొరియా

South Korea…..దక్షిణ కొరియా

దక్షిణ కొరియా ఆసియా ఖండంలో ఓ చిన్న దేశం.. ద్వీపకల్ప దేశం.. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశం. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌. ఈ దేశ విస్తీర్ణం 605 చ. కిలోమీటర్లు ఈ దేశ కరెన్సీ సౌత్‌ కొరియన్‌ ఓన్‌ వీరి అధికారిక భాష కొరియన్‌. పారిస్‌ తర్వాత జనసాంద్రత ఎక్కువ ఉన్నదిక్కడే.
కొరియా 1948లో ఉత్తరకొరియా, దక్షిణ కొరియాగా విడిపోయింది. ఈ రెండు దేశాలకూ మధ్య విబేధాలతో 1950-1953 మధ్య కొరియా యుద్ధం వచ్చింది. అది ముగిశాక కూడా ఈ దేశాలు శత్రువులుగానే ఉంటున్నాయి. కొరియన్‌ యుద్ధంలో ఈ నగరం మొత్తం నాశనమైంది. దాన్నుంచి కోలుకుని మరో 50 ఏళ్లలోనే అభివృద్ధి చెందిన నగరాల జాబితాలో స్థానం దక్కించుకుంది. సముద్రంలో రెండు దీవుల మధ్య ఖాళీని పూడ్చి ఇక్కడి ఇంచియోన్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కట్టారు. రద్దీ ఎక్కువగా ఉండే విమానాశ్రయాల్లో ఇదీ ఒకటి.
ఈ దేశం ఉత్తర కొరియాతో సరిహద్దుల్ని పంచుకుంటుంది. అత్యంత అభివృద్ధి చెందిన ప్రపంచ నగరాల్లో ఈ దేశ రాజధాని నగరం సియోల్‌ ఒకటి. ఇప్పుడు ఉన్న జనాభాలో 82 శాతం మంది పట్టణాలు, నగరాల్లోనే జీవిస్తున్నారు. 6,398 అడుగుల ఎత్తయిన పర్వతం జేజు ఈ దేశంలోనే ఉన్నది. ఈ దేశంలో పుట్టిన యువకులు 21 నుంచి 24 నెలలపాటు తప్పనిసరిగా మిలటరీలో పనిచేయాల్సి ఉంటుంది.
ఉపాధ్యాయ వృత్తిని ఇక్కడ గౌరవంగా, ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఉపాధ్యాయులకు అత్యధిక వేతనమూ వస్తుంది. వీరు 4 అంకెను దురదృష్ట సంఖ్యగా భావిస్తారు. అందుకే చాలా భవనాల్లో నాలుగో అంతస్థును కట్టరు. పదమూడు సంఖ్య కూడా అంతే.
పిల్లలకు పేర్లు పెట్టడానికి చాలానే డిమాండ్‌ ఉంటుందిక్కడ. 60 శాతం కుటుంబాల వారు నిపుణుల్ని సంప్రదించి మాత్రమే వారి పిల్లలకు పేర్లు పెడతారు. ఈ సేవలందించేందుకు అక్కడ కార్యాలయాలూ ఉంటాయి.
ఇక్కడ 20శాతం మంది పేర్ల చివర కిమ్‌ ఉంటుంది. లీ, పార్క్‌ అనే పేర్లూ ఎక్కువగా చివరన పెట్టుకుంటారు. వయసు లెక్కించడంలో ఇక్కడి పద్ధతి వేరు. పుట్టిన పిల్లలను ఏడాది వయసున్న వారిగా లెక్కిస్తారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వారి వయసును లెక్కిస్తారు. అలాగే సంవత్సరం మారిపోతే వయసూ ఒక సంవత్సరం పెరిగిపోయినట్టు భావిస్తారు. అంటే డిసెంబర్‌లో పుట్టిన పాపాయికి జనవరి రాగానే రెండేళ్లు వచ్చేస్తాయి.
ఓటు హక్కు రావాలంటే ఖచ్చితంగా 19ఏళ్లు వచ్చి ఉండాలి. శరీరంపై ఎవరైనా టాటూ వేయించుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా వైద్యుడిచ్చిన అనుమతి పత్రం ఉండాల్సిందే.
స్త్రీలతో పాటు ఈ దేశంలోని పురుషులూ ఎక్కువగా మేకప్‌ని ఇష్టపడతారు. 20 శాతం మంది మగవాళ్లు రోజూ మేకప్‌ వాడతామని చెబుతున్నారట.
ప్రపంచంలోనే ప్లాస్టిక్‌ సర్జరీలకు పెట్టింది పేరు ఈ దేశం. అందుకే దీన్ని ‘వరల్డ్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ’ అని పిలుస్తారు. ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు తప్పకుండా ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్న వారే ఉంటారంటారు.
పక్కనే ఉన్న ఉత్తర కొరియా ఈ దేశానికి శత్రుదేశం. ఉత్తరకొరియా అధినేతలపై ఎవ్వరూ జాలి చూపించకూడదు. ఆయనకు అనుకూలంగా మాట్లాడకూడదు. అలాంటి బ్లాగులూ నడపకూడదు. ఈ నిబంధనల్ని లెక్కచేయకుండా ఆ పనిచేసిన వారికి జైలు శిక్ష తప్పదు
ప్రపంచంలో వేగంగా ఇంటర్నెట్‌ వచ్చే దేశాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. దాదాపుగా అన్ని చోట్లా ఉచిత వైఫై జోన్లుంటాయి. 95 శాతం ఇళ్లకు బ్రాడ్‌ బ్యాండ్‌ ఉంది. ఈ దేశంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌, నెట్‌ బ్యాంకింగ్‌ వ్యవహారాల్ని కచ్చితంగా ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ నుంచే చెయ్యాలి. ఇందుకు వేరే ఏ బ్రౌజర్‌నీ ఉపయోగించకూడదు. దాన్నే వాడాలని ఇక్కడ చట్టమే ఉంది.
. ప్రముఖ ఎలాక్ట్రానిక్స్‌ సంస్థ శామ్‌సంగ్‌ ఈ దేశానికి చెందినదే. మరియు ఎల్జీ, హుందాయ్‌...లాంటి సంస్థలు ఈ దేశానికి చెందినవే.
. ప్రపంచం మొత్తం వాడే సీవీడ్‌ అనే సముద్రపు నాచులో 90శాతం ఇక్కడే వినియోగిస్తారు. దీనితో చేసుకునే సీవీడ్‌ సూప్‌ వీరి సంప్రదాయ వంటకం. పుట్టిన రోజుల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో దీన్ని చేసుకుంటారు. ఆక్టోపస్‌లను ఎక్కువగా తింటారు. వరి, బార్లీ, దుంపల్ని ఎక్కువగా పండిస్తారు.
. ఎలక్ట్రానిక్స్‌, టెలీకమ్యునికేషన్స్‌కి సంబంధించిన పరికరాల తయారీ కోసం ఇక్కడ కుటీర పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి.
ఉత్తర కొరియా ప్రత్యేకతలు
ప్రపంచంలోని అతి పెద్ద చర్చిల్లో ఒకటైన యోధోఫుల్‌ గోస్పెల్‌ చర్చి ఉన్నదిక్కడే. దీంట్లో ఒకేసారి పది లక్షల మంది ప్రార్థనలు చేసుకునే వీలుంది.
2003 నుంచి ఏడాదిలో నాలుగుసార్లు ఇక్కడ ‘హాయ్‌ సియోల్‌ ఫెస్టివల్‌’ పేరుతో పండుగలు చేసుకుంటారు..
ఇక్కడి లాట్‌ వరల్డ్‌.. ప్రపంచంలోనే అతి పెద్ద ఇండోర్‌ థీమ్‌ పార్క్‌. చుట్టూ ఎత్తయిన కొండల మధ్యలో ఉంటుందీ నగరం. దీని మీదుగా హేన్‌ నది ప్రవహిస్తుంటుంది. షాపింగ్‌కి పెట్టింది పేరు. 20కిపైగా షాపింగ్‌మాళ్లు, 30వేలకు పైగా మామూలు దుకాణాలూ ఉన్నాయి. ఎన్‌సియోల్‌ టవర్‌ ఇక్కడ ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. ఇది అబ్జర్వేషన్‌, కమ్యూనికేషన్‌ టవర్‌. 1971లో నిర్మించారు.
ప్రపంచంలోనే పొడవైన బ్రిడ్జ్‌ ఫౌంటేన్‌ ఇక్కడుంది. జలపాతం ఎగసి పడుతున్నట్టు వంతెన నుంచి ఫౌంటేన్‌ చిమ్ముతుంటుంది. ఏడు రంగుల ఎల్యీడీ లైట్లను దీనికి అమర్చారు. దీంతో ఆ దీప కాంతుల ఇంద్రధనుస్సు జలపాతం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. సాయంత్రం చీకటి పడినప్పటి నుంచీ ఈ వింత దీప కాంతుల్ని అంతా చూడొచ్చు. దీనికి గిన్నిస్‌ బుక్‌ రికార్డూ ఉంది. ఈ ఫౌంటేన్‌ మొత్తం 370 అడుగుల పొడవుంటుంది.
ఆహారం : వీరి భోజనంలో బియ్యం, మాంసం, కూరగాయలతో చేసిన వంటకాలుంటాయి. రోజువారీ భోజనంలోనూ తక్కువలో తక్కువ ఏడెనిమిది సైడ్‌ డిష్‌లు కనిపిస్తాయి.