header

Srilanka.... శ్రీలంక

Srilanka.... శ్రీలంక

ప్రపంచంలోనే అందమైన దేశాలలో శ్రీలంక ఒకటి. శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉన్న పొరుగు దేశం కూడా. శ్రీలంక రాజధాని కొలంబో. ప్రధాన భాష సింహళం. తరువాత ఎక్కువగా తమిళం మాట్లాడతారు. వీరి కరెన్సీ శ్రీలంక రూపాయి. దక్షిణ దేశాలలో అత్యధిక అక్షరాస్యత కల దేశం. దాదాపు 92 శాతం మంది విద్యాధికులు.
రామాయణ కాలం నాటి రావణుడి రాజ్యం శ్రీలంక ఇదేనని చాలామంది నమ్ముతారు. 1972 వరకు శ్రీలంకను సిలోన్ అని పిలిచేవారు. 1948లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందింది.
ఈ దేశంలో 100కు పైగా నదులున్నాయి. జలపాతాలు కూడా ఎక్కువే. జలవిద్యుత్ ఎక్కువ. అతి ప్రాచీనమైన మహాబోధియా అనే వృక్షం ఉంది ఇక్కడ.
ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన సిలోన్ టీపొడి ఇక్కడే తయారవుతుంది. తేయాకు ఎక్కువగా పండిస్తారు. తేయాకు ఎగుమతులు కూడా ఎక్కువే.
శ్రీలంక చూడటానికి వెళ్లేవారు తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలున్నాయి. శ్రీలంక చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. మాదకద్రవ్యాలతో పట్టుబడితే మరణశిక్ష కూడా విధిస్తారు. శ్రీలంకకు వేళ్లేటపుడు అపరిచితులు కానీ, తెలిసిన వారు కానీ విమానాశ్రయాలలో శ్రీలంకలో అందచేయమని ఇచ్చిన ఎటువంటి ప్యాకెట్లను గానీ, వస్తువులను కానీ మొహమాటానికి కూడా తీసుకువెళ్లటం మంచిది కాదు. వాటిలో మాదకద్రవ్యాలు ఉండవచ్చు.
శ్రీలంక పర్యాటకపరంగా కూడా పేరుపొందిన దేశం.