header

Syria.... సిరియా

Syria.... సిరియా

పశ్చిమాసియాలోని దేశం సిరియా. 1944 జనవరి 1 న ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. సిరియా రాజధాని డమాస్కస్. కరెన్సీ సిరియన్ పౌండ్ సిరియా దేశ అధికారిక భాష అరబిక్. ఇది ముస్లిం దేశం 90 శాతం మంది ముస్లింలు, వీరిలో సున్నీ శాఖ వారు ఎక్కువ. 8 శాతం మంది క్రైస్తవులు కలరు. ఈ దేశ వైశాల్యం 1,85,180 చదరపు కిలోమీటర్లు.
ఇరాక్, జోర్డాన్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ మరియు మధ్యధరా సముద్రం సరిహద్దులు. వేల సంవత్సరాల క్రితం వైభవోపేతమైన నాగరికతలు వర్ధిల్లిన దేశం సిరియా. డమాస్కస్, అపెప్పో, పాల్మయిరా నగరాలు క్రీ.పూర్వం 2000 సంవత్సరాల నాటికే ఉన్నాయి. ఓరోంటిక్ నది, యూఫ్రటీస్ నది దీని ఉపనదులు యార్మక్ ప్రదాన నీటి వనరులు. ప్రజలకు వ్యవసాయమే ముఖ్య వృత్తి. పశుపోషణ కూడా జీవనోపాధియే.
బార్లీ, గోధుమ, అపరాలు,ఆలివ్, ప్రత్తి, బీటు దుంపలు, పండ్లు ప్రధానమైన పంటలు. పెట్రోల్ నిక్షేపాలు కలవు.
పత్తి, పళ్ళు, బంగాళదుంపలు, చెరకు, గోధుమలు, బార్లీ, కూరగాయలు పండిస్తారు. చమురు సహజవాయువులు, దుస్తుల పరిశ్రమలు, పళ్ళు, కూరగాయల ప్రాసెసింగ్, బార్లీ, ఊలు, సిమెంటు, తోలు వస్తువులు, గ్లాస్, మెటల్ పరిశ్రమలు కలవు.
ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలతో చిన్నపాటి యుద్ధాలు ఎక్కువగా జరుగుతుంటాయి.
2013 లో జరిగిన రసాయన దాడిలో ఈ దేశం ఒక్కసారిగా వార్తలలోకి వచ్చింది. ప్రజలు ఎక్కువగా రాజధాని డమాస్కస్ ప్రాంతంలో నివసిస్తుంటారు. సిరియన్లు ఎక్కువగా వ్యాపారరంగంలో ఉన్నారు.
క్రీస్తుశకం 632లో మహమ్మద్, ఇతర అరబ్బీ సైనికులు ఆ దేశాన్ని ఆక్రమించారు. ఆ విధంగా సిరియాదేశం ముస్లిం మత దేశంగా మారిపోయింది. కొన్ని వందల సంవత్సరాలపాటు ఖలీఫాలు పరిపాలించారు. తరువాత 11 వ శతాబ్దంలో క్రైస్తవులు ఈ దేశాన్ని ఆక్రమించారు కానీ తరువాత ముస్లిం రాజులచే తరిమి వేయబడ్డారు.