1971లో ఏడు ఏమిరట్లు 1. అభూదాభి, 2. అజ్మన్, 3. దుబాయ్, 4. ఫుజిరా, 5. రసల్ ఖైమా, 6. షార్జా, 7.ఉమ్మాల్ కలసి సమైక్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమాఖ్యగా ఏర్పడినది. వీటిలో అభూదాభి ఎమిరేట్ రాజదానిగా సేవలనందిస్తునది. ఈ ఏడు ఎమిరేట్ లని కలుపుతూ 2 ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి. ఒక రోడ్డు పేరు ఎమిరేట్స్ రోడ్ కాగా, మరో పేరు షేక్ జాయేద్ రోడ్డు.
ఈ సమాఖ్య ఎమిరేట్ అని కూడా వ్యవహరిస్తారు, ఎమిరేట్ అంటే అరబ్ భాషలో దేశం అని అర్ధం. వీరి అధికార భాష అరబిక్.
ఈ సమాఖ్య సరిహద్దులు ఆగ్నేయ దిక్కున పర్షియన్ జలసంది తూర్పున సౌదీ అరేబియా మరియు దక్షిణాన ఒమన్ సరిహద్దు దేశాలు.
ఈ సమాఖ్య జనాభా 9.2 మిలియన్లు, ఇందులో 1.4 మిలియన్లు ఎమిరేట్ దేశస్తులు కాగ మిగత జనాభా వలస వచ్చినవారు.
ఈ ఎమిరేట్లలో ఇస్లాం అధికారిక మతం. 80 శాతం మంది సున్నీలు, 20 శాతం మంది షియా సున్నీలు. అరబిక్ అధికారిక భాష. ఇంగ్లీష్ కూడా ఎక్కువగా మాట్లాడతారు. ఇతర మతాల ప్రచారం నిషిద్ధం
యు.ఎ.ఇ. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది, ప్రపంచంలోనే పదిహేడవ అతిపెద్ద సహజ వాయువు నిల్వలు కలిగి ఉంది.
దేశం మొత్తంలో 31 చర్చీలు మరియు బుర్ దుబాయిలో ఒక హిందూ ఆలయం, జెబెల్అలీ లో ఒక సిక్కు గురుద్వార్)మరియు అల్ గర్హౌడ్ లో ఒక బౌద్ధ ఆలయం ఉన్నాయి.
ఈ సమాఖ్య ఆర్ధికంగా పెట్రోల్ ఎగుమతుల మీద ఆధారపడి ఉంది. అభూధభీ, దుబాయ్ దేశాలలో పెట్రోల్ నిక్షేపాలు పుష్కంగా ఉన్నాయి. ఎడారి ప్రాంతంలో ఖర్జూరం పండుతుంది.