రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ (Republic of Uzbekistan) మధ్య ఆసియాలోని దేశం. రాజధాని నగరం తాష్కెంట్. వీరి అధికార భాష ఉజ్బెక్. ప్రజలలో 85% ప్రజలు టర్కీ భాష మాట్లాడుతారు, రష్యన్ భాష కూడా దేశమంతటా వ్యాపించి ఉంది. ఉజ్బెకి ప్రజలు 81%, రష్యన్లు 5.4%, తజకీలు 4%, కజఖ్ ప్రజలు 3% ఇతరులు 6.5% ఉన్నారు. ఈదేశం ముస్లిం దేశం. ఈ దేశం ఒకప్పటి అఖండ రష్యాలోని ఒక భాగం
ఈ దేశానికి పడమర మరియు ఉత్తరాన కజకిస్తాన్, తూర్పున కిర్గిజ్ స్తాన్ మరియు తజికిస్తాన్, దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్ మరియు తుర్కమేనిస్తాన్ దేశాలు సరిహద్దులు.
సోవియట్ రష్యా విచ్ఛిన్నం తరువాత 1991 ఆగస్టు 31న ఉజ్బెకిస్థాన్ " ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్ "గా ప్రకటించబడింది. మరుసటి రోజున అధికారికంగా స్వతంత్ర దినం జరుపుకుంది.
పత్తి, బంగారం, యురేనియం మరియు సహజవాయువు మొదలైన వాటి ఉత్పత్తి మీద ఈ దేశ ఆర్దిక పరిస్థితి ఆధారపడి ఉంది.