తూర్పు ఆసియాలోని సోషలిస్ట్ రిపబ్లిక్ దేశం వియత్నాం. ఇందులో ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాంలు ఉన్నాయి. వియత్నాం పర్వతాలతో ఉన్న దేశం. అన్నామైట్ పర్వత శ్రేణికి రెండు పక్కలా ఉత్తరాన ఎర్రనది, దక్షిణాన మీకాంగ్ నదులు ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో డెల్టాలు ఏర్పడడంతో నేల సారవంతమై దేశానికి ధాన్యాగారాలుగా మారాయి.
వియత్నాం విస్తీర్ణం 3,31,653 చ.కి.మీ. రాజధాని హానోయ్. వీరి భాష వియత్నామీస్. వీరి కరెన్సీ డాంగ్ లు. ప్రజలలో వియత్నామీలు 88 శాతం మంది ఉన్నారు. చైనీస్, ధాయ్, క్మర్, మూవాంగ, మాంగ్ తెగలవారు కొద్ది మంది నివసిస్తున్నారు. బౌద్దమతంలోని టావో శాఖను 55 శాతం ప్రజలు పాటిస్తున్నారు.
వరి ప్రధానమైన పంట. రబ్బరు, కొబ్బరి, చెరకు, కాఫీ పంటలను పండిస్తారు.
నేలబొగ్గు, తగరం, రాగి, జింకు, క్రోమైట్, ఫాస్పేట్ రాయి మొదలగు ఖనిజ నిక్షేపాలు లభిస్తాయి.
సిమెంట్, కాగితం, సిగరెట్లు, తోలు సామాగ్రి, వ్యయసాయ సామాగ్రి ప్రధానమైన పరిశ్రమలు. సరస్సులలో చేపల వేట సాగిస్తారు.