header

Australia….. ఆస్ట్రేలియా

Australia….. ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా ఖండం భూభాగాలతో పాటు టస్మానియా మరెన్నో ద్వీపాలతో ఉన్న దేశం. ఈ దేశానికి సరిహద్దులు పపువా, న్యూగినియా, ఇండోనేషియా, తూర్పు తిమోర్ , సాలమన్ ద్వీపాలు, పనాటూ, న్యూజిలాండ్ దేశాలు.ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రా. ఈ దేశ విస్తీర్ణం 76,92, 024 చ. కి.మీటర్లు. వీరి కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. అధికారిక భాష ఆంగ్లం. ఆస్ట్రేలియా క్రిస్టియన్ దేశం. విస్తీర్ణపరంగా చూస్తే ప్రపంచంలో ఆరో పెద్ద దేశం.
ఈ దేశంలో క్రీయాశీలక అగ్నిపర్వతం ఒక్కటికూడా లేదు. ప్రపంచంలోని అత్యంత విషపూరిత పాములు 15 జాతులలో 10 రకాలు ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి.
పర్యాటకపరంగా అతి పెద్ద సముద్రతీరం కలిగి ఉన్న దేశం ఆస్ట్రేలియా. పదివేలకు పైగా బీచ్ లు ఉన్నాయి. ఆస్ట్రేలియా అనగానే వెంటనే కంగారులు గుర్తుకు వస్తాయి. ఇక్కడ ఉన్న కంగారులలో 60 జాతులున్నాయి. ఈ దేశ జనాభాకన్నా కంగారుల సంఖ్యే ఎక్కువ. గొర్రెల పెంపకం కూడా ఇక్కడా ఎక్కువే. 150 మిలియన్ల గొర్రెలున్నాయి. ఇవి కూడా ఈ దేశ జనాభాకన్నా ఎక్కువే.
ప్రపంచంలోనే అతి పెద్ద గోల్ఫ్ మైదానం ఉన్నది. దీని పొడవు 850 మైళ్లు.
గోధుమలు, బార్లీ, చెరకు, పండ్లు పండిస్తారు. పశువుల పెంపకం, గొర్రెల పెంపకం, కోళ్లపెంపకం కలదు.
బాక్సైట్, బోగ్గు, ఇనుప ఖనిజం, బంగారం, వెండి, యురేనియం, నికెల్, టంగ్ స్టన్, జింక్, వజ్రాలు, సహజవాయువు, పెట్రోల్ సహజ. నిక్షేపాలు