‘ఫిజీ’ అనే ఈ ద్వీప దేశం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. మొత్తం 322 ద్వీపాల సమూహంతో ఈ దేశం ఏర్పడింది. 332 ద్వీపాల్లో 110 ద్వీపాల్లో మనుషులు నివసించడం లేదు. ఆస్ట్రేలియాకు ఈశాన్య దిశలో.. దక్షిణ అమెరికాకు పశ్చిమ దిశలో ఉన్న పసిఫిక్ మహా సముద్రం నడుమ ఈ ద్వీపాలున్నాయి. ఇక్కడ నివసించే జనాభాలో 38 శాతం మంది భారతీయులే. దేశ సాంప్రదాయాలను ఇక్కడ పక్కగా పాటిస్తారు. హిందూ దేవాలయాలను చాలా చోట్ల చూడవచ్చు.
ఫిజీ రాజధాని సువా. ఇక్కడ ఇంగ్లీష్, బు ఫిజీ, హిందీ భాషలు మాట్లాడతారు. దేశ వైశాల్యం 18,270 చ.కి.మీ. 52 శాతం మంది క్రిస్టియన్లు, 38 శాతం మంది హిందువులు, 8 శాతం మంది ముస్లింలు ఈ దేశంలో కలరు. బ్రిటీష్ వారి నుంచి విముక్తి పొందినా.. ఆ దేశం జెండాలను మార్చలేదు. ఇక్కడ ఇంకా క్వీన్ ఎలిజిబెత్ -2 చిత్రాలు ఉన్న నోట్లు, నాణాలనే నగదుగా వాడుతున్నారు.
ఇక్కడ చాలామంది ప్రజలు ఇండియా, ఇండో-ఫిజిన్స్. వీరంతా ప్రధాన ఐలాండ్ విటి లెవులో నివసిస్తున్నారు. ఫిజీలో హిందూ, క్రిస్టియన్ జనాభా ఎక్కువ
1874లో బ్రిటీష్ ప్రభుత్వం ఈ దీవులను ఆక్రమించింది. ఈ దేశంలో చెరకు తోటల్లో పనిచేసేందుకు భారతీయ కూలీలను ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కడ భారత సంతతి జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. 1970లో బ్రిటీషు ప్రభుత్వం ఫిజీకి స్వాతంత్ర్యాన్నిచ్చింది. అప్పటి నుంచి ఈ దేశాన్ని ‘రిపబ్లిక్ ఆఫ్ ది ఫిజీ ఐలాండ్స్’ అని పిలుస్తున్నారు.
ఇక్కడ ‘బులా’ అంటే ‘హలో’ అని అర్థం. అక్కడ అడుగుపెట్టే పర్యటకులను స్థానికులు ‘బులా’ అని పలకరిస్తారు. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు.
ఈ ద్వీపంలోని విటీ ద్వీపంలో దాదాపు 8,00,000 మంది ప్రజలు జీవిస్తున్నారు. చూట్టు సముద్రం.. మధ్యలో కొండలు, తీర ప్రాంతాలతో ఫిజీ పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడి ప్రజలు FIJIని ‘ఫన్ ఇన్ జంగిల్ ఐలాండ్’ అంటారు.
.
ఫీజిలోని నది ప్రాంతంలో ఉన్న శ్రీ శివ సుబ్రహ్మణ్య ఆలయం ఇక్కడికి వచ్చే భారతీయ పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఫీజీలో స్థిరాస్తి వ్యాపారాలనేవి కనిపించవు. ఎందుకంటే అక్కడ 80 శాతం భూములు గ్రామ సంఘాల ఆధీనంలోనే ఉంటాయి. కేవలం పది శాతం స్థలాలను మాత్రమే విక్రయాలు, కొనుగోలుకు అనుకూలంగా ఉంటుంది. మిగతావి నివాస స్థలాలు.
ఇక్కడ మట్టి రూపంలో ఉండే ద్రవాన్ని జాతీయ డ్రింక్గా తాగుతారు. చూసేందుకు ఇది బురద రూపంలో ఉంటుంది. ఈ ద్రవం తాగితే ఒత్తిడి, ఇన్సోమ్నియా, తలనొప్పి తగ్గుతుంది. ఇక్కడి ప్రజలు ఇక్కడ రగ్బీ ఆడతారు. ప్రజలు ఎక్కువగా మాంసం, చేపలను ఆహారంగా తీసుకుంటారు.
ఫిజీకి కేవలం విమానాల్లో మాత్రమే వెళ్లాలి. భారతదేశంలోని ముంబయి నుంచి ఫిజీకి విమానాలు అందుబాటులో ఉన్నాయి.
చెఱకు, కొబ్బరికాయలు, కర్రపెండలం దుంపలు, వరి, బంగాళా దుంనలు, అరటికాయలు వ్యవసాయ ఉత్పత్తులు. పశువులు, పందులు, గుర్రాలు, గొర్రెలను పెంచుతారు.
కలప, బంగారం, చేపలు సహజ సంపదలు