కిరిబటి... పసిఫిక్‌సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీప దేశం. 33 దీవులతో ఉండే ఈదేశంలో 21 దీవుల్లో మాత్రమే జనాలుంటారు. ఈ దేశం భారతదేశంలోని హైదరాబాద్‌కన్నా కాస్త పెద్దగా ఉంటుంది. దేశం మొత్తంలో లక్ష మందికి పైగా ప్రజలుంటారంతే.
కిరిబటి రాజధాని తరవా. ఈ దేశ విస్తీర్ణం 811 చదరపు కిలోమీటర్లు వీరి అధికార భాషలు ఆంగ్లం, గిల్బర్టీస్. కరెన్సీ ఆస్ట్రేలియన్‌డాలర్. రాజధాని తరవా, గిల్బర్టే దీవుల్ని 1941లో మొదటి సారిగా జపనీయులు కనిపెట్టారు. జనాభా మొత్తంలో 90 శాతం మంది గిల్బర్టే ద్వీపంలో ఉంటారు. 1979 జులై 12వ తేదీన బ్రిటీష్ వారినుండి ఈ దేశం స్వాతంత్ర్యం సంపాదించుకుంది, దేశ ప్రజలలో 52 శాతం మంది క్రిస్టియన్లు.
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పగడపు దీవులతో (కోరల్‌రీఫ్స్) ఉన్న దేశం ఇదే. దేశంలో సగం పగడపు దీవులే ఉంటాయి.
ఈ దేశంలో సముద్రమట్టానికి ఎక్కువ ఎత్తులో ఉన్న ఏకైక ద్వీపం బనబా. ఇది 266 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ దేశంలోని దీవుల్లో చాలావరకు సముద్ర మట్టానికి మూడు నుంచి ఆరు అడుగుల ఎత్తులో మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 1999లో టెబువా తరవా, అబనువా అనే చిన్నద్వీపాలు మునిగిపోయాయి కూడా. మరో 50 ఏళ్లలో ఈ దేశం కూడా మునిగిపోతుందని అనుకుంటున్నారంతా. అందుకే ఈ దేశ ప్రజల్ని వేరే దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ దేశంలో క్రిస్మస్‌దీవి వైశాల్య పరంగా ప్రపంచంలో అతి పెద్దది. ఈ దీవుల్లో క్రీస్తుపూర్వం 3000, క్రీస్తుశకం 1300 మధ్య కాలంలో మైక్రోనీషియన్స్‌అనే జాతి వారుండేవారట. కిరిబటి ప్రముఖ వేడుక ఏటా మార్చినెలలో జరిగే యప్‌డే ఫెస్టివల్.
చేపల ఎగుమతి, పర్యాటకం ద్వారా ఈ దేశానికి ఆదాయం వస్తుంది.