header

Papua New Guinea పపువా న్యూ గినియా

Papua New Guinea పపువా న్యూ గినియా

పపువా న్యూగినియా ఒక దీవి. ప్రజలు 850 భాషలకు పైనే మాట్లాడుతారు. అంటే ప్రపంచ భాషల్లో పదో వంతు భాషలు మాట్లాడేది ఇక్కడే. అధికారిక భాష ఆంగ్లమే అయినా ఎక్కువగా స్థానిక భాషలే చలామణిలో ఉంటాయి.
ఈ దేశ రాజధాని పొర్ట్‌మెర్సిబ్‌ జనాభా 80,83,700 (2018) ఈ దేశ విస్తీర్ణం 4,62,840 చదరపు కిలోమీటర్లు కరెన్సీ పపువా న్యూ గినియా కినా(పీజీకే). పట్టణాల్లో ఉండేవారు కేవలం పద్దెనిమిది శాతం మందే. 1933 వరకు సముద్రపు గవ్వల్ని కరెన్సీగా వాడేవారు. ఎక్కువమంది క్రిస్టియన్లు. జెండాలో బంగారు వర్ణంలో ఉండే ప్యారడైజ్‌పక్షి బొమ్మ స్థానిక గిరిజనులకు చిహ్నం. 1971లో ఈ జెండాను 15 ఏళ్ల సుసాన్‌అనే అమ్మాయి రూపొందించింది.
ప్రపంచంలోనే తొలిసారిగా వ్యవసాయం చేసిన దేశాల్లో ఇదీ ఒకటి. సుమారు ఆరున్నర వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ పంటలు పండించిన ఆధారాలున్నాయి. ఇక్కడి ‘కుక్‌’ అనే వ్యవసాయ క్షేత్రం పురాతనమైనది. ప్రపంచ వారసత్వపు జాబితాలో చేర్చారు. ఇక్కడ బర్డ్‌ఆఫ్‌ప్యారడైజ్‌పక్షులతో పాటు 750కి పైగా ఇతర పక్షి జాతులున్నాయి. ప్రపంచంలోనే విషపూరితమైన పక్షి హుడెడ్‌పితోహు ఈ ప్రాంతానికి చెందినదే.
కాఫీ, కోకో, టీ ఆకులు, చెరకు, బంగాళా దుంపలు, పండ్లు, రబ్బర్, కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు
బంగారం, రాగి, వెండి, సహజవాయులు ఈ దేశంలో లభించే ఖనిజ నిక్షేపాలు