పసిఫిక్ మహాసముద్రానికి దక్షిణాన ఉన్న ఈ దేశం 176 ద్వీపాలతో ఉన్న దేశం. 1800 సంవత్సరంనుండి ఈ దేశంలో క్రైస్తవమతం వ్యాప్తి చెందినది. ఈ దేశ వైశాల్యం 748 చ.కి.మీ. దేశ రాజధాని Nuku'alofa . 1970 సంవత్సరంలో ఈ దేశం బ్రిటీష్ వారినుండి స్వాతంత్ర్యం పొందింది.
టోంగన్ మరియు ఇంగ్లీష్ వీరి భాషలు. ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది. వీరి కరెన్సీ pa'anga.
వీరి కొబ్బరి, అరటి, వెనీలా బీన్స్, భూమిలో పండే దుంపలు వ్యవసాయ ఉత్పత్తులు.
ఉష్ణమండలపు సముద్రతీరాలు, వర్షాధార అడవులు, అగ్నిపర్వతాలు ఈ దేశంలో ఉన్నాయి. పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతున్న దేశం టాంగా. పర్యాటక పరంగా ఈ దేశానికి అధిక ఆదాయం సమకూరుతుంది.