header

Vanuatu……వనౌతు...

Vanuatu……వనౌతు...

పసిఫిక్ మహాసముద్రంలోని స్వతంత్ర గణ రాజ్యం వనౌతు. 1774 సంవత్సరంలో కెప్టెన్ కుక్ ఈ దేశాన్ని సందర్శించి న్యూహెబ్రిడీన్ అని పేరు పెట్టాడు. ఫ్రెంచ్ మరియు బ్రిటీష్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని పెత్తనం సాగించారు. తరువాత ఈ దేశం 1980 పంవత్సరంలో స్వాతంత్ర్యం సంపాదించుకొని వనౌతుగా మారింది.
ఈ దేశంలో 80 చిన్న, చిన్న దీవులు, 13 పెద్దదీవులు ఉన్నాయి. పెద్ద దీవి పేరు ఎస్పిరితూ సాంతో. ఒకప్పుడు యూరోప్ దేశానికి చెందిన దొంగ నావికులకు స్థావరంగా ఉంది. 1906 సం. లో ఫ్రెంచ్ వారి ఆధీనంలోకి వచ్చింది.
వనౌతూ రాజధాని విలా, ఈ దేశ విస్తీర్ణం 12,190 చ.కి.మీ. వీరి అధికార భాషలు ఇంగ్లీష్ మరియు పిడ్జిన్. వీరి కరెన్సీ వాటు. ప్రజలు మెలనీషన్ జాతులకు చెందినవారు. ప్రజలలో 82 శాతం మంది క్రైస్తవ మతానికి చెందినవారు.
కొబ్బరి, కాఫీ, కోకో, కందమూలాలు, వేరు సెనగ, అరటి, మొక్కజొన్న, ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. పందుల పెంపకం ఎక్కువ. మత్య్యపరిశ్రమ కలదు. మాంగనీస్ ఖనిజాన్ని జపాన్ కు ఎగుమతి చేస్తారు.