అండోరా... యూరప్‌లోని ఒక చిన్న దేశం. ఇది పైరెనీస్‌పర్వతాలకు తూర్పున ఉంటుంది. స్పెయిన్, ఫ్రాన్స్‌దేశాలు సరిహద్దులు. జెండాలోని రంగులన్నీ ఫ్రాన్స్, స్పెయిన్‌దేశాల నుంచి పొందిన స్వాతంత్య్రానికి గుర్తులు. నీలం, ఎరుపు ఫ్రాన్స్‌నుంచి, ఎరుపు, పసుపు స్పెయిన్‌నుంచి తీసుకున్నారు.
అండోరా అనే పదం అరబిక్‌భాషలోని అల్‌దురా అనే పదం నుంచి వచ్చిందట. దీనర్థం ‘ముత్యం’ అని. ఈ దేశ రాజధాని అండోరా లా వెల్లా యూరప్‌మొత్తంలో ఎత్తయిన రాజధాని. సముద్రమట్టానికి 3,356 అడుగుల ఎత్తులో ఉంటుంది. అండోరా రాజధాని అండోరా లా వెల్లా జనాభా 85,470 (2018) దేశ విస్తీర్ణం 467.63 చదరపు కిలోమీటర్లు. కరెన్సీ యూరో, అధికారిక భాషలు కాటలాన్, స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్ ప్రజలు ఫ్రెంచ్‌కూడా ఎక్కువగా మాట్లాడుతుంటారు.
ఇక్కడ అక్షరాస్యత రేటు ఎక్కువ. ఈ దేశం మంచి పర్యాటక ప్రాంతం. గత ఏడాది కోటి మందికిపైగా పర్యాటకులు వస్తారు ఈ దేశానికి. దేశంలో కేవలం 2 శాతం భూమిని వ్యవసాయానికి ఉపయోగిస్తారు. ఎక్కువ భాగం ఆహారం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ దేశంలో విమానాశ్రయాలు, రైల్వే లైన్లు లేవు. రోడ్డు మార్గం ఎక్కువగా వాడుతారు. ప్రపంచంలో సురక్షితమైన దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ దొంగతనాలు చాలా చాలా తక్కువ. జేబు దొంగలు అసలు ఉండరట.
ఈ దేశ సైనికులకు కేటాయించే బడ్జెట్ స్వచ్ఛంద విరాళాలపై ఆధారపడి ఉంటుంది కుటుంబ యజమానిగా ఉండే మగవారి దగ్గర ఆత్మరక్షణ కోసం చట్ట ప్రకారం తుపాకీ ఉండొచ్చు.