మధ్య యూరోప్ లోని చిన్న దేశం ఆస్ట్రియా. ప్రాచీన చరిత్ర గల దేశం. రోమన్లు, షార్లమాన్లు, ఓటొ, హేప్స్ బర్గ్ లు మొదలైన వారు ఈ దేశాన్ని పరిపాలించారు. ఆస్ట్రియా రాజధాని వియన్నా. ఈ దేశ విస్తీర్ణం 83,857 చ.కి.మీ. వీరి అధికారిక భాష జర్మన్. వీరి కరెన్స యూరోలు. ప్రజలు క్రైస్తవ మతం పాటిస్తారు. ఈ దేశం యూరోపియన్ యూనియన్ లో సభ్యదేశం
మెట్టేర్నేక్ నాయకత్వంలో విప్లవం జరిగింది. కానీ తరువాత ఆస్ట్రియా హంగేరీ సమాఖ్యలో చేరటం జరిగింది. 1918 సం.లో మరలా విడిపోయి స్వతంత్ర రాజ్యంగా అవతరించింది.
ఈ దేశం సుప్రసిద్ధ, పాశ్చాత్య వాగ్గేయకారులు మొజర్ట్, షాన్ బెర్గ్, షూబెర్ట్ వంటి వారికి జన్మస్థానం.
ఆస్ట్రియా వాస్తు, శిల్ప సందదలకు పేరుపొందినదేశం. వియన్నాలోని శిల్ప కళాసంపద ప్రపంచవ్యాప్తంగా పేరుపొందినది.
ఆల్ఫ్ పర్వతశ్రేణులు ఉన్న ఈ దేశం కొండలతో నిండి ఉంటుంది. ఖనిజ సంపద ఎక్కువే కానీ నాణ్యత ఉండదు.
లిగ్నేట్, బొగ్గురాయి, రాగి, గ్రాఫైట్, ఇనుము, సీసం, చమురువాయివు, జింకు, ఉప్పు ముఖ్య ఖనిజాలు. ఆస్ట్రియాలో జలవనరులు ఎక్కువగా ఉన్నాయి. జలవిద్యుత్ ను పొరుగు దేశాలకు అమ్ముతుంది.
బార్లీ, రై ఓట్స్, బీట్ రూట్ లను ఎక్కువగా పండిస్తారు. పశువుల పెంపకం కూడా ఎక్కువే.
సిమెంట్, రసాయనిక ద్రవ్యాలు, కర్రసామాను, విద్యుత్ పరికరాలు, ఉక్కు, తోలు సామాగ్రి, మోటారు కార్లు, కాగితపు గుజ్జు వస్త్రపరిశ్రమ ముఖ్యమైనవి.