బెలారస్ లో 10,000 సంవత్సరాల క్రితమే ప్రజలు నివసించినట్లు చారిత్రిక ఆధారాలు లభించాయి. ఆదునిక బెలారస్ విషయంలో 13 వ శతాబ్ధంలో గ్రాండ్ డచ్ ఆఫ్ లిధూనియాలో భాగంగా ఉంది. 1795 సంవత్సరంలో రష్యాచేత ఆక్రమించబడి రష్యా విచ్చిన్నం వరకు ఆ దేశంలో భాగంగా ఉంది. 1991 లో స్వతంత్ర దేశంగా అవతరించింది.
బెలారస్ రాజధాని మిన్స్క్. ఈ దేశ వైశాల్యం 2,07,600 చ.కి.మీ. వీరి భాష బెలారసియన్ మరియు రష్యన్. వీరి కరెన్సీ బెలారసియన్ రూబుల్. ఈ దేశం క్రిస్టియన్ దేశం.
గింజ ధాన్యాలు, బంగాళాదుంపలు, కూరగాయలు, అవిశలు వ్యవసాయ ఉత్పత్తులు. పాడి, పశుమాంసం లభిస్తాయి.
కొద్దిగా సహజవాయివు, ఆయిల్, గ్రనైట్, డోలమైట్, లైమ్ స్టోన్, చాక్, ఇసుక సహజసంపదలు.