header

Belgium / బెల్జియం

Belgium / బెల్జియం

యూరోప్ ఖండంలో చిన్న దేశాలలో బెల్జియం ఒకటి. రాజ్యాంగాన్ని ఏర్పరుచుకుని రాజవంశీయులు పరిపాలిస్తున్న దేశం. 1830 సంవత్సరంలో నెదర ల్యాండ్స్ నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశానికి ఉత్తర సముద్రాన్ని ఆనుకుని 60 కి.మీ సముద్ర తీరం ఉంది. బెల్జియం విస్తీర్ణం 30,518 చ.కి.మీ. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్. వీరి అధికార భాషలు డచ్ మరియు ఫ్రెంచ్ భాషలు. ఈ దేశ కరెన్సీ యూరోలు. ఈ దేశంలో జనసాంద్రత ఎక్కువ. బ్రెజిల్ క్రైస్తవ దేశం
అంట్ వేర్ప్ రేవు పట్టణం. లిగాజ్, నాల్ సెయింట్, చార్లెరోయి పారిశ్రామిక పట్టణాలు. ఘెంట్, లవువెయిన్, లీగే ప్రముఖ పట్టణాలు.
ఉత్తర ప్రాంతంలో సారవంతమైన బంకమన్ను నేలలో వ్యవసాయం చేస్తారు. ఈ ప్రాంతన్ని ఫ్లాండర్స్ అంటారు. ఇక్కడ పల్లపు మైదానాలను పోల్డర్లు అంటారు. మధ్య మైదానాలు కూడా సారవంతమైనవే. లీ నది, మాసీ నది, సంబ్ర్ నది, జేర్తె నది, సమోలా నదులు బెల్జియంలో ప్రధాపమైన నదులు, జలాధారాలు. సాగునీటికి సమస్య లేదు. కళలు, సంగీతం, నిర్మాణాలు బెల్జియం ప్రజల జీవితంలో ప్రధానపాత్ర పోషిస్తాయి.
గోధుమ, ఓట్ ధాన్యం, బీటు దుంపలు, ఫ్లాక్స్, రై ధాన్యం, హెంప్ నార, చికోరీ , బంగాళా దుంపలు పండిస్తారు. జింక్, మార్బుల్ రాయి, స్లేట్ క్వారీలు కూడా కలవు. కాడ్, హెర్రింగ్, అయిస్టర్ చేపలు ఎక్కువగా దొరకుతాయి. ఓస్టెండ్ ప్రాంతం మత్స్య పరిశ్రమకు పేరుగాంచింది. పారిశ్రామిక దేశంగా బెల్జియం పేరుపొందింది. సాకర్ ను ఈ దేశ ప్రజలు ఎక్కువగా ఆడతారు.
ఇనుప ఖనిజాలు, నేలబొగ్గు లభ్యత లేనందువలన వీటిని దిగుమతి చేసుకొని కర్మాగారాలు నడుపుతున్నారు. వీటిలో గాజు పరిశ్రమ ప్రముఖమైనది. జవుళీ, సంగీత పరికరాలు, పొయానో, ర్గాన్, కలప సామాగ్రి, తోలు వస్తువులు, మార్గరీన్, వెనార్, పంచదార, కిటికీల రంగు గాజు పలకలు, వజ్రాలను సానపెట్టడం, సారా బట్టీలు ప్రధానమైన పరిశ్రమలు