header

Bulgaria… బల్గేరియా….

Bulgaria… బల్గేరియా….

బల్గేరియా.... బల్గేరియా దేశం ఐరోపా ఖండం లోనిది. ఈ దేశానికి ఉత్తరాన రొమేనియా, పశ్చిమాన సెర్బియా, మాసిడోనియా, దక్షిణాన గ్రీస్‌, టర్కీ దేశాలు సరిహద్దులు. తూర్పున నల్ల సముద్రం ఉంటుంది. ఐరోపా మొత్తంలో దేశం ఏర్పడ్డాక పేరు మారకుండా ఉన్న ఏకైక దేశమిది. క్రీస్తు శకం 681 నుంచి ఈ దేశం పేరు బల్గేరియానే.
బల్గేరియా రాజధాని సోఫియా. జనాభా 72,02,198 (2018) . దేశ విస్తీర్ణం 1,10,994 చదరపు కిలోమీటర్లు వీరి భాష బల్గేరియన్‌ వీరి కరెన్సీ లెవ్‌.ఈ దేశం ఆర్ఢోడాక్స్ తెగకు దేశం. తరువాత ముస్లింలు, క్రిస్టియన్స్ కొద్దిశాతం మంది ఉన్నారు. ప్రాచీన బల్గేరియా క్యాలెండర్‌ను ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన క్యాలెండర్‌గా 1976లో యునెస్కో పేర్కొంది.
జెండాలోని పాన్‌స్లేవిక్‌రంగుల్లోని ఎరుపు, తెలుపు రంగుల్ని స్వీకరించారు. ఆ రంగుల్లో మూడోదైన నీలం స్థానంలో రష్యన్‌త్రివర్ణాల్లోని ఆకుపచ్చ రంగును జెండాలో ఉంచారు. ప్రపంచంలో పురాతనమైన బంగారు నిధి దొరికింది ఇక్కడే. 294 సమాధుల్లో ఆరువేల ఏళ్ల నాటి మూడువేల బంగారు వస్తువులు లభించాయి.
ఈ దేశ విస్తీర్ణంలో అత్యధికంగా మూడింట ఒక వంతు అడవులే. ఇక్కడ రోజాపూలను ఎక్కువగా సాగుచేస్తారు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న రోజ్‌ఆయిల్‌మొత్తంలో 85 శాతం ఈ దేశంలోనే తయారవుతుంది.
పుట్టిన రోజుల కన్నా ఇక్కడి ప్రజలు నామ కరణం రోజుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే బర్త్‌డే కంటే మించి ఏటా నేమ్‌డేస్‌ని ఘనంగా చేసుకుంటారు. ‘కాదు’ అని తెలపడానికి తలను అటూ ఇటూ అడ్డంగా తిప్పటం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ‘అవును’ అని చెప్పడానికి పైకీ కిందకీ తిప్పుతారు. కానీ ఈ దేశంలో దీనికి వ్యతిరేకం. అడ్డంగా వూపితే అవుననీ, పైకీ కిందకీ ఆడిస్తే కాదనీ అర్థం.
యుద్ధంలో ఒక్కసారి కూడా ఓటమిపాలవ్వని ఘనత బల్గేరియా సైన్యానిది. మొదటి ఎలక్ట్రానిక్‌కంప్యూటర్‌ని తయారుచేసింది ఈ దేశానికి చెందిన జాన్‌విన్సెంట్‌అటనసోఫ్‌. తొలి డిజిటల్‌గడియారాన్ని తయారు చేసిన పీటర్‌పెట్రోఫ్‌కూడా బల్గేరియా వాసే. ప్రపంచంలోనే తొలి మిలటరీ పైలట్‌మహిళ రైనా కసబోవా ఈ దేశస్థురాలే.