యూరప్ లోని ఉత్తర సముద్రం, బాల్టిక్ సముద్రాల మధ్య ఉన్న డెన్మార్క్ అభివృద్ధి చెందినదేశం. డెన్మార్క్ ను ఆనుకున్న ఉన్న 480 చిన్న దీవులు, ఆర్క్ టిక్ వలయంలోని గ్రీన్ ల్యాండ్, ఫాడో దీవులు కూడా డెన్మార్క్ కు చెందినవే. డెన్మార్క్ విస్తీర్ణం 43,092 చ.కి.మీ. రాజధాని కోపెన్ హెగ్. వీరి అధికార భాష డేనిష్. కరెన్సీ డానిష్ క్రోన్.
డెన్మార్క్ రాజవంశ పాలనలో ఉంది. ఎన్నికైన పార్లమెంట్ కూడా ఉంది. డెన్మార్క్ వ్యయసాయ ప్రధానమైన దేశం. పాడిపరిశ్రమకు ప్రసిద్ధి చెందినది. సహకారోద్యమం విస్తృతంగా ఉన్న దేశం. 1866 సం.లో మొదటి సహకార సంస్థ స్థాపించబడినది.
నౌకా నిర్మాణం, యంత్ర సామాగ్రి ఉత్పత్తి ముఖ్యమైన పరిశ్రమలు. కోపెన్ హగ్ హార్బరులో నల్ల రాతిలో చెక్కిన అందమైన మెర్ మెయిడ్ శిలా విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
బార్లీ, గోధుమలు, బంగాళాదుంపలు, పంచదార దుంపలు వ్యవసాయ ఉత్పత్తులు. పందుల పెంపకం, పాడిపరిశ్రమలు కలవు.
పెట్రోల్, సహజవాయువు, చేపలు, ఉప్పు మొదలగు సహజసంపదలు లభిస్తాయు