header

Estonia….ఎస్తోనియా...

Estonia….ఎస్తోనియా...

ఎస్తోనియా ప్రజలు పురాతన కాలం నుండి స్వతంత్రంగా జీవించారు. తరువాత ఈ దేశం డెన్మార్, స్వీడన్, రష్యా, జర్మనీ దేశస్తుల చే 1200 సంవత్సరం తరువాత ఆక్రమించబడింది. 1940 వ సంవత్సరంలో ఎస్తోనియా బలవంతంగా సోవియట్ యూనియన్ లో కలపబడింది.
1991 సంవత్సరంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్న తరువాత ఎస్తోనియా స్వతంత్ర దేశంగా అవతరించింది. 2004 సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ లో సభ్యదేశంగా చేరింది.
ఈ దేశ రాజధాని టాల్లిన్. ఈ దేశ వైశాల్యం 45,226 చ.కి.మీ. వీరి అధికార భాష ఎస్తోనియా. తరువాత రష్యాభాష కూడా 37 శాతం మంది ప్రజలు మాట్లాడుతారు. ప్రజలు ఎక్కువమంది క్రిస్టియన్ మతానికి చెందినవారు. వీరి కరెన్సీ ఎస్తోనియన్ క్రోన్.
బంగాళాదుంపలు మరి కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు. పాల ఉత్పత్తులు, చేపలు, పశుసంపద ఇతర జీవనోపాధులు.
ఫాస్పేట్, లైమ్ స్టోన్, ఇసుక, డోలోమైట్, క్లే, పీట్, వ్యయసాయ యోగ్యమైన భూములు సహజ సంపదలు