పశ్చిమ యూరోప్ లోని ప్రముఖ దేశం ఫ్రాన్స్. జర్మనీ, ఇటలీ దీనికి సరిహద్దులు. సుదీర్ఘమైన చరిత్ర గల దేశం. ఒకప్పడు రాజులు పాలించి దేశం. 1789-1793 సం.ల మధ్య కాలంలో ఫ్రెంచ్ విప్లవం ఫలితంగా ప్రజాతంత్ర దేశంగా ఆవిర్భబించింది. తరువాత కొంతకాలం నెపోలియన్ వంటి నియంతలు కూడా పాలించారు.
ఫ్రాన్స్ దేశ విస్తీర్ణం 5,43,965 చ.కి.మీ. రాజధాని పారిస్. వీరి అధికార భాష ఫ్రెంచ్. ప్రజలు సౌందర్యోపాసకులు. సుఖ జీవనాన్ని కోరుకుంటారు. వీరు వంటలు ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందినవి. ఫ్రాన్స్ ఆర్ధికపరంగా సంపన్నమైన దేశమే కాక బలమైన సైనిక సంపత్తి గల దేశం కూదా.
ఫ్రాన్స్ లోని రైన్ నదీలోయ సారవంతమయినదే కాకుండా పడవ ప్రయాణాలకు సౌకర్యం గల నది. గారొన్నే నదీ ప్రాంతం సారాయికి అనువైన ద్రాక్షా తోటల పెంపకానికి అనువైన ప్రాంతం. 1050 కి.మీ. నడివిగల లోయిరే నది ఫ్రాన్స్ లో పెద్దనది. ఆల్ప్, జూరా కొండలలో పారే ఏరులున్న ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలు.
రైన్ నది సాగు నీటిని అందిస్తుంది. రైస్ నదీ ప్రాంతంలోని రివీరా పర్యాటక ప్రాంతం కూడా.
గోధుమ రే ధాన్యం, బీటు పంచదార దుంపలు,ద్రాక్ష, మొక్కొన్న, బంగాళాదుంపలు, రేప్ సీడ్, పొద్దు తిరుగుడు, ఆపిల్, కూరగాయలు, పీచ్, ఓట్ ధాన్యం పండిస్తారు. వీటిని భారీగా ఇతరదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.
పాల ఉత్పత్తులు, మాంసం కూడా ఎగుమతి చేస్తారు. పీతలు, హెర్రింగ్ చేపలు, గండుమీను, గండు రొయ్యలు, మేకరిల్, అయిస్టర్ చేపలు, సార్డీన్ చేపలు ఎక్కువగా దొరకుతాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం ఫ్రాన్స్.
విమానాల తయారీ, మోటారు కార్ల తయారీ, యంత్రసామాగ్రి, విద్యుత్ పరికరాలు, కలప సామాగ్రి, ఇనుము, ఉక్కు, ఆభరణాలు, అత్తర్లు, జవుళీ, మధ్యం, కాగితం, అల్యూమినియం పరిశ్రమలు ఉన్నాయి.
చరిత్ర ప్రసిద్ది పొందిన డెకార్డే, వాల్టేర్, విక్టర్ హూయగో, జోన్-ఆఫ్-ఆర్క్, నెపోలియన్, మోనాసా వంటి గొప్పవారికి జన్మనిచ్చిన దేశం ఫ్రాన్స్.
ఫ్రాన్స్ దేశం పర్యాటక దేశం కూడా. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఐఫీల్ టవర్ ఫ్రాన్స్ లోనే ఉంది.