జర్మనీ దేశం యూరోప్ ఖంఢం మధ్యలో కలదు. ఈ దేశంలోని ప్రజలలో ప్రతి పదిమందిలో ఒకరు విదేశీయులే. జర్మనీ దేశం కళలకు ముఖ్యంగా క్లాసికల్ సంగీతానికి ప్రసిద్ధి చెందినది. రెండవ ప్రపంచ యుద్దంలో(అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వంలో) జర్మనీ పరాజయం పాలై దారుణంగా నష్టపోయింది. ఈ యుద్ధం తరువాత జర్మనీ తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ రెండు దేశాలుగా విడిపోయింది. క్రమ క్రమంగా పశ్చిమ జర్మనీ యూరోప్ లోనే ఆర్ధికంగా బలమైన దేశంగా రూపొందింది. 1989 వ సంత్సరంలో తూర్పు జర్మనీ మరియు పశ్చిమ జర్మనీ కలసిపోయాయి. పశ్చిమ జర్మనీ తూర్పు జర్మనీ అభివృద్ధికి బిలియన్స్ డాలర్స్ ఖర్చు పెట్టింది.
జర్మనీ రాజధాని బెర్లిన్ వీరి అధికార భాష జర్మన్. ఈ దేశ వైశాల్యం 3,49,334 చ.కి.మీ. జర్మనీ క్రిస్టియన్ దేశం. వీరి కరెన్సీ యూరోలు.
బంగాళా దుంపలు, గోధుమలు, బార్లీ, పండ్లు, క్యాబేజీ వ్యవసాయ ఉత్పత్తులు. పశువులు, పందులు, కోళ్ల పెంపకం కలదు.
బొగ్గు, లిగ్నేట్, సహజవాయువు, ఇనుప ఖనిజం, యూరేనియం, పొటాష్, సాల్ట్, కలప, వ్యవసాయ యోగ్యమైన భూములు సహజ సంపదలు.