header

Great Britan / గ్రేట్ బ్రిటన్

Great Britan / గ్రేట్ బ్రిటన్

ప్రపంచ ప్రసిద్ధి పొందిన దేశం గ్రేట్ బ్రిటన్. యూరోప్ లో పశ్చిమదిశలో ఉంది. దీనినే యునైటెడ్ కింగ్ డమ్ అని కూడా పిలుస్తారు. ఫ్రాన్స్ దేశానికి బ్రిటీష్ దీవులకు మధ్య ఇంగ్లీష్ ఛానల్ కలదు. ఈ దేశ విస్తీర్ణం 2,44,110 చ.కి.మీ. రాజధాని లండన్ నగరం. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలు క్రైస్తవులు. బర్మింగ్ హామ్, గ్లాస్కో, లీడ్స్, షెఫీల్డ్, లివర్ పూల్, బ్రాడ్ ఫర్డ్, మాంచెస్టర్, ఎడిన్ బర్గో, బ్రిస్టల్ మొదలగునవి బ్రిటన్ లో ప్రధాన దేశాలు.
వేల్స్, స్కాట్ లాండ్, ఐర్లాండ్, మాన్ దీవి, ఛానల్ దీవులను కలిపి యునైటెడ్ కింగ్ డమ్ గా పిలుస్తారు. బ్రిటీష్ వారు నైపుణ్యం కలిగిన నావికులు. సుదూర ప్రాంతాలకు సముద్రమార్గంలో నావలలో ప్రయాణించి అనేక రాజ్యాలను ఆక్రమించి తమ రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశం కూడా అందులో ఒకటి. అనేక వలస రాజ్యాలు స్థాపించి ఒకప్పుడు రవి అస్తమించని రాజ్యం అని పేరు పొందింది బ్రిటన్.
17వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు వీరి ప్రాబల్యం కొనసాగింది. ప్రపంచ దేశాలలో ఎక్కువ దేశాలు వీరి దేశం కంటే పెద్ద దేశాలు కూడా భారతదేశం, చైనాతో సహా వీరి దురాక్రమణకు గురయ్యాయి. చాలా దేశాలు వీరి కుయుక్తుల వలన వారి సంప్రదాయాలను, ఆచారాలను కోల్పోయాయి. భారతదేశం నుండి అపార సంపద, శిల్పసంపద దోచుకుని పోయారు. వాటిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం కూడా ఒకటి
క్రమంగా ఈ దేశాలన్నీ స్వాతంత్ర్యం సంపాదించుకోవటంతో ప్రస్తుతం ఈ దేశం నామమాత్రంగా మిగిలింది. కానీ ఇంగ్లీష్ భాష మరియు వీరి సంప్రదాయాలు చాలా దేశాలలో పాదుకొనిపోయాయి.
ఎలిజబెత్ – 1, విక్టోరియా మహారాణుల కాలంలో ఈ దేశం బాగా విస్తరించింది. డిజ్రేలీ, గ్లాడ్ స్టన్, చాంబర్లేన్, లాయిడ్ జార్జ్, విన్ స్టన్ చర్చిల్ వంటి ప్రతిభావంతులైన వారు ప్రధాన మంత్రులుగా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు.
షేక్స్ పియర్, మిల్టన్ వంటి పేరుపొందిన కవులకు ఈ దేశం జన్మస్థానం. 18వ శతాబ్దంలో ఆవిరి యంత్రం ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవానికి బీజం పడింది ఈ దేశంలోనే. ప్రపంచానికి గ్రీనిచ్ కాలమానం పరిచయం చేసింది కూడా ఈ దేశమే.
గ్రేట్ బ్రిటన్ లో ధేమ్స్ నది పెద్దది. దీని పొడవు 346 కి.మీ. సెవర్న్ మరియు ఉత్తర ఐర్లాండ్ లోని లఫ్ నీగ్ సరస్సు జలవనరులు.
బ్రిటీష్ మ్యూజియం ప్రపంచ ప్రసిద్ధి పొందిన మ్యూజియం. ఆక్సఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ యూనివర్శిటీలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి.
బర్మింగ్ హామ్, షెఫీల్డ్, లివర్ పూల్, మాంచెష్టర్, లీడ్స్, బ్రిస్టల్ ప్రధానమైన పారిశ్రామిక కేంద్రాలు.
లండన్ నగరం కూడా పారిశ్రామిక కేంద్రం. ఇనుప ఖనిజం, సుద్ద, బంకమన్ను, సున్నపురాయి, ఉప్పు ఖనిజ నిక్షేపాలు. మాటారు కార్లు, విమానాలు, నౌకలు, జవుళీ, కాగితం, ధాతు పరిశ్రమలు, విద్యుత్ యంత్రాలు, కంప్యూటర్లు, శాస్ర్తీయ పరికరాలు, ప్లాస్టిక్ గాజు, ఆహార పదార్ధాలు మొదలగు వాటికి లండన్ నగరం అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం.
బార్లీ, ఓట్స్, బంగాళా దుంపలు, ఓట్స్, మొక్కజొన్న, బీట్ దుంపలు ప్రధానంగా పండిస్తారు.
కోళ్ల పరిశ్రమ, పశుపోషణ పందుల పోషణ, గొర్రెల పెంపకం ఎక్కువ.